రైలు పట్టాలపై ఎమ్మెల్యే కుమారుడి మృతదేహం | JDU MLA Bima Bharti Son Found Dead On Railway Track In Patna | Sakshi
Sakshi News home page

Aug 3 2018 1:44 PM | Updated on Aug 3 2018 1:44 PM

JDU MLA Bima Bharti Son Found Dead On Railway Track In Patna - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పట్నా: నలందా మెడికల్‌ కాలేజీ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభించడంతో కలకలం రేగింది. ఈ ఘటన పట్నా రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో మృత దేహాన్ని గుర్తించారు. చనిపోయింది జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి కుమారుడు దీపక్‌గా తేల్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్నా ఎమ్మెల్యే భారతి, ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపించారు. తమ కుమారుడిని ఎవరో హత్య చేశారని ఆరోపించారు. ముసల్లాపూర్‌లో ఫ్రెండ్స్‌ ఇంట్లో పార్టీ ఉందని గురువారం రాత్రి దీపక్‌ ఇంటినుంచి వెళ్లాడని తెలిపారు. కాగా, బిహార్‌ రాజకీయాల్లో దీపక్‌ తండ్రి అవ్‌దేష్‌ మండల్‌ కీలక నేతగా ఉన్నారు. ఆయనకు రాజకీయంగా మిత్రులు, శత్రువులు కూడా ఎక్కువేననీ, దీపక్‌ను ఎవరైనా హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని అన్నారు. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఎమ్మెల్యే కుంటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement