లైంగిక వేధింపుల కేసులో ఉపాధ్యాయుడి అరెస్ట్‌ | Govt School Teacher Arrested For Molesting Class 8 Student In Himachal Pradesh | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల కేసులో ఉపాధ్యాయుడి అరెస్ట్‌

Jul 6 2018 8:22 PM | Updated on Sep 15 2018 6:06 PM

Govt School Teacher Arrested For Molesting Class 8 Student In Himachal Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

షిమ్లా(హిమాచల్‌ ప్రదేశ్‌): ఎనిమిదో తరగతి విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసినందుకు గానూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

షిమ్లా(హిమాచల్‌ ప్రదేశ్‌): ఎనిమిదో తరగతి విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసినందుకు గానూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన కల్లు  జిల్లాలోని నిర్మానంద్‌ బ్లాక్‌లో జూలై 3న చోటుచేసుకుంది. రోజూ వేధింపులకు పాల్పడటంతో ఉపాధ్యాయుడి గురించి బాలిక  తల్లిదండ్రులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చిందని  స్థానిక డీఎస్పీ రోహిత్‌ తెలిపారు.

 బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోస్కో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టామని, కోర్టు నిందితుడికి జూలై 13 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో రిమాండ్‌ తరలించామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement