స్నేహితుడే నిందితుడు..!

The  friend Is accused..! - Sakshi

హోమోసెక్స్‌కు ఒత్తిడి  చేయడంతోనే ఘాతుకం

వీడిన హత్య కేసు మిస్టరీ

నిందితుడి అరెస్ట్‌ 

నార్కట్‌పల్లి మండలం ఎనుగులదోరి గ్రామంలో ఈ నెల 7వ తేదీన వెలుగుచూసిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హోమోసెక్స్‌కు ఒత్తిడి చేయడంతోనే స్నేహితుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సుధాకర్‌ కేసు వివరాలు వెల్లడించారు.   

 నార్కట్‌పల్లి (నకిరేకల్‌) : నార్కట్‌పల్లి మండలం ఎనుగులదోరి గ్రామానికి చెందిన జాన్‌రెడ్డి (25), చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన మాదాసు ఆరోగ్యం ఇద్దరూ స్థానిక ఐడియల్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరిద్దరు బావ, బావమరుదుల వరసతో పిలుచుకుంటూ తిరిగేవారు. వీరు తమ ఫోన్లలో పలుమార్లు అశ్లీల చిత్రాలు చూసేవారు. అందులో ఇద్దరు మగవారు కలిసి చేసుకునే హోమోసెక్స్‌కు ఆకర్షితులై కొంత కాలంగా పలుమార్లు ఆ విధంగా కలుసుకున్నారు.

స్నేహితుడిని ఓదార్చేందుకు..

గత నెల 13న ఆరోగ్యం చిన్న కూతురు మృతిచెందింది. ఆ బాధలో ఉన్న ఆరోగ్యాన్ని స్నేహితులు ఓ దార్చే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే ఆరోగ్యాన్ని స్నేహితులందరూ కలిసి ఆరోగ్యాన్ని జాన్‌పహాడ్‌ దర్గా వద్దకు తీసుకెళ్లి పార్టీ చేస్తున్నారు.

బెదిరించి..

జానపహాడ్‌ నుంచి తిరిగి వచ్చిన అనంతరం జాన్‌రెడ్డి ఫోన్‌చేసి ఆరోగ్యాన్ని కలుసుకోవాలని ఒత్తిడి చేశాడు. అతను రానని చెప్పడంతో అసహనానికి గురైన జాన్‌రెడ్డి వారిద్దరి మధ్య ఉన్న సంబంధం బయటపెడతానని బెదిరించాడు.తన భార్యని కూడా కలవాలని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన ఆరోగ్యం జాన్‌రెడ్డి బతికిఉంటే ఎప్పటికైన ప్రమాదమే అనుకుని చంపాలని పథకం వేశాడు.

ఒత్తిడి చేసి పిలిపించుకుని..

జాన్‌రెడ్డి పలుమార్లు ఫోన్‌చేసి ఒత్తిడి చేయడంతో ఆరోగ్యం విసిగిపోయాడు. దీంతో అతడిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.అప్పటికే తాగి ఉన్న జాన్‌రెడ్డిని చంపడానికి అనుకూల సమయమని నిర్ధారించుకున్న ఆరోగ్యం తనతో పాటు చిన్నకత్తిని వెంట తెచ్చుకున్నాడు. ఎప్పటిలాగే వ్యవసాయబావి వద్ద మంచంపై దుస్తులు లేకుండా మంచానికి జాన్‌రెడ్డిని కట్టివేసి ఆరోగ్యం తనతో తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి చంపాడు.

మృతుడి కాల్‌డేటా ఆధారంగా నిందుతుడిని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.  సమావేశంలో శా లిగౌరారం సర్కిల్‌ సీఐ క్యాస్ట్రోరెడ్డి, ఎస్‌ఐ గోవర్థ న్, సిబ్బంది మధు, రమేష్, జనార్ధన్‌ ఉన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top