
పోలీసులు స్వాధీనం చేసుకున్న చెంబు, నకిలీ నాగమణి
నాగమణి, రెండు తలల పాముతో
యశవంతపుర: నాగమణి, రెండు తలల పాముతో మంచి జరుగుతుందని నమ్మించి మోసం చేస్తున్న ముగ్గురు మోసగాళ్లను బెంగళూరు ఉత్తర విభాగం మహాలక్ష్మీ లేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్రదుర్గ హిరియూరుకు చెందిన ప్యారుబాయి, తమకూరుకు చెందిన శివణ్ణ, కృష్ణప్పలను అరెస్ట్ చేసి నకలీ నాగమణి (అవలం), రెండు తలల పామును స్వాధీనం చేసుకున్నారు. రాజాజీనగర ఇస్కాన్ దేవస్థానం సమీపంలోని ఇందిరా క్యాంటీన్ పక్కన ఓ రంగురాయి చూపుతూ అలసైన అవలం అని అమ్మడానికి సిద్ధం అవుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు ప్యారుబాయిని పట్టుకున్నారు. అతడి వద్దనున్న నకిలీ అవలంతో పాటు ప్రాచీన కాలం నాటి చెంబు, తట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఎపిఎంసీ యార్డ్ కాయగూరల మార్కెట్ రోడ్డులో రెండు తలల పామును అమ్ముతుండగా శివణ్ణ, కృష్ణప్పలను అరెస్ట్ చేసిన్నట్లు పోలీసులు తెలిపారు.