క్వాటర్‌ బాటిల్‌ రూ.1200, నటుడు అరెస్ట్‌

Draupathi Actor Rizwan Arrested For Illegal Smuggling Of Liquor - Sakshi

సాక్షి, చెన్నై : క్వాటర్‌ బాటిల్‌ మద్యాన్ని రూ.1200 చొప్పున దొంగచాటుగా విక్రయిస్తున్న సినీ సహాయ నటుడిని, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీన్ని అరికట్టడానికి మే 3 వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌  కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో భాగంగా తమిళనాడులో టాస్మాక్‌ దుకాణాలను మూసివేశారు. దీంతో కొందరు దొంగ చాటుగా మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. (లాక్డౌన్: ఆదిలాబాద్లో వైన్షాప్ లూటీ)

చెన్నైతో స్థానిక ఎంజీఆర్‌ నగర్, అన్నా మెయిన్‌రోడులోని ఒక ఇంటిలో దొంగచాటుగా మద్యాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆదివారం అక్కడికి వెళ్లిన పోలీసులకు పలు మద్యం బాటిళ్లు దాచిన విషయం బయట పడింది. దీంతో వాటిని దొంగచాటుగా విక్రయిస్తున్న రిస్కాన్‌ (30) అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. పోలీసుల విచారణలో అతను సహాయ నటుడని తెలిసింది. అతను తన మిత్రుల నుంచి క్వాటర్‌ మద్యం బాటిల్‌ను రూ.1000కి కొనుగోలు చేసి ఇతరులకు రూ.1200లకు ఇంటికే తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు చెప్పారు. (కరోనా కాలం: మందు బాబుల ముందు జాగ్రత్త)

దీంతో పోలీసులు  రిస్కాన్‌ ఇచ్చిన సమాచారంతో మిగతవారిని అరెస్ట్‌ చేశారు. అందులో ఒక వ్యక్తి స్థానిక చూలైమేడు, కామరాజ్‌నగర్‌కు చెందిన కాల్‌ టాక్సీ డ్రైవర్‌ దేవరాజ్, రెండో వ్యక్తి సాలిగ్రామం, దివాకర్‌నగర్‌కు చెందిన ప్రదీప్‌ అని తెలిసింది. కాగా దేవరాజ్‌ కారులో ఉన్న 189  క్వాటర్‌ మద్యం బాటిళ్లను, రూ. 20 వేల డబ్బుతో పాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. (మీరు మద్యం ప్రియులా.. తాగాలని ఉందా..?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top