అద్రాస్‌పల్లి ప్రశాంతంగా ఉంది : డీసీపీ పద్మజా రెడ్డి

DCP Padmaja Reddy Comments Over Shamirpet Murder Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బుధవారం అద్రాస్‌ పల్లిలో హత్యకు గురైన ఆంజనేయులుకు తిన్న తరువాత బైటకు వెళ్లే అలవాటు ఉందని, అలవాటు ప్రకారం అతను 8.30 సమయంలో శ్మశానం వైపు వెళ్లాడని అతడి బంధువులు చెప్పినట్లు  బాలానగర్‌ డీసీపీ పద్మజా రెడ్డి పేర్కొన్నారు. శామీర్‌పేట యువకుడి హత్య ఘటనపై గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లక్ష్మి గత 5 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందింది. ఆంజనేయుల్ని లక్ష్మి బంధువులు చితిలో దహనం చేసినట్లు అతడి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్న ఆంజనేయులు కనపడటం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం.

నిన్న రాత్రి 10.30కు మాకు ఆంజనేయులు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. లక్ష్మీ బావ బలరాంపైన ఆంజనేయులు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. సంఘటనా స్థలంలో లభించిన రక్తం ఎములను స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రికి నిర్ధారణ కోసం తరలించాం. గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉంది. ముందు జాగ్రత్తగా పికెటింగ్ ఏర్పాటు చేసా’’మని ఆమె తెలిపారు.

చదవండి : మహిళ చితిపైనే యువకుడి శవాన్ని.. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top