బాలుడు కిడ్నాప్‌.. క్షేమం | boy kidnap: safe | Sakshi
Sakshi News home page

బాలుడు కిడ్నాప్‌.. క్షేమం

Jan 5 2018 8:51 AM | Updated on Jul 12 2019 3:29 PM

సాక్షి, ఒంగోలు: జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో ఓ విద్యార్థి కిడ్నాప్‌నకు గురయ్యాడు. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికెళ్తున్న గుర్రం ప్రణవ్(11) అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం  అతని తల్లిదండ్రుల నుంచి రూ.70 లక్షలు డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. కాగా, గంటల వ్యవధిలోనే కిడ్నాప్‌ కేసును ఛేదించి కిడ్నాపర్ల ముఠాలోని ఒకరిని ప్రకాశంజిల్లా పోలీసులు గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు. దీంతో బాలుడు క్షేమంగా ఉన్నాడు. తమ పిల్లవాడు తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement