చైన్‌ స్నాచింగ్‌, రఫ్పాడించిన తల్లీకూతుళ్లు | Bike borne chain snatchers caught red-handed by a woman and her daughter | Sakshi
Sakshi News home page

చైన్‌ స్నాచింగ్‌, రఫ్పాడించిన తల్లీకూతుళ్లు

Sep 3 2019 6:13 PM | Updated on Sep 3 2019 6:39 PM

Bike borne chain snatchers caught red-handed by a woman and her daughter - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మెడలో బంగారు గొలుసులతో ఆడవాళ్లు  కనిపిస్తే.. చైన్‌ స్నాచింగ్‌లతో రెచ్చిపోయే కేటుగాళ్ల ఆగడాలకు చెక్‌ చెప్పే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తన మెడలో గొలుసు లాక్కునేందుకు  ప్రయత్నించిన యువకుడికి కూతురుతో కలిసి తగిన శాస్తి చేసిందో మహిళ.  ఆగస్టు 30న ఢిల్లీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

తల్లీ కూతుళ్లు పక్కన నిలుచొని ఉండగా,  బైక్‌పై వచ్చిన దుండగుల్లో ఒకడు  మహిళ మెడలోని చెయిన్‌ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతే శరవేగంగా స్పందించిన ఆమె (తల్లి) బైక్‌పై వెనక కూర్చుని ఉన్న అతగాణ్ని గుంజి నాలుగు తగిలించింది. దీనికి యువతి (కూతురు) కూడా తోడయ్యింది. ఇంతలో చుట్టుపక్కల వారు కూడా జత కూడడంతో అతగాడి ఆట కట్టింది.  ఈ దృశ్యాలు మొత్తం  సీసీటీవీలో రికార్డయ్యాయి. మరోవైపు  బైక్‌పై  వున్న  మరో  యువకుడు పారిపోవడం  కూడా  కెమెరా కంటికి చిక్కింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు  నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement