మద్యం మత్తులో నటుడి హల్‌ చల్‌ | Bhojpuri Actor Raja Chaudary Drunk and Brawl | Sakshi
Sakshi News home page

Jun 2 2018 7:52 AM | Updated on Jun 2 2018 10:02 AM

Bhojpuri Actor Raja Chaudary Drunk and Brawl - Sakshi

నటుడు రాజా చౌదరి

లక్నో: భోజ్‌పురి నటుడు రాజా చౌదరి మరోసారి వివాదంతో వార్తల్లో నిలిచాడు. పీకల దాకా తాగి హల్‌ చల్‌ చేస్తూ ప్రజలపై దాడికి దిగాడు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజా మద్యం మత్తులో ఊగిపోతూ కనిపించిన వారిపై చెయ్యి చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రాజాను అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక ఎస్సై తెలిపారు. 

కాగా, హిందీ బిగ్‌బాస్‌-2 షో ద్వారా రాజా పాపులర్‌ అయ్యాడు. ఆ షో రన్నరప్‌ కూడా. నటి శ్వేతా తివారీ మాజీ భర్త అయిన రాజా గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇదే తరహాలో పలువురిపై చెయ్యి చేసుకుని కేసులు ఎదుర్కొంటున్నాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement