భార్యను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

Bengaluru Man Commits Suicide And Said It Is Better Than Cancer - Sakshi

బెంగళూరు : క్యాన్సర్‌ మహమ్మారికి భయపడి ఓ వ్యక్తి తనతో పాటు భార్య, పెంపుడు కుక్క ప్రాణాలను కూడా తీశాడు. అయితే భార్యాభర్తలిద్దరిలో క్యాన్సర్‌ ఎవరికి అనే విషయం స్పష్టంగా తెలీదు. బెంగుళూరుకు చెందిన అతుల్‌ ఉపాధ్యాయ అనే వ్యక్తి చివరి క్షణాలు.. ప్రవర్తించిన తీరు స్థానికులతో పాటు పోలీసులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. వివరాలు.. అతుల్‌ భార్య ప్రతిరోజు జిమ్‌కెళ్తుంది. ఈ క్రమంలో గత మంగళవారం అతుల్‌ తన భార్యను జిమ్‌లోనే డంబెల్‌తో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత పెంపుడు కుక్కను మేడ మీద నుంచి విసిరేశాడు. మరుసటి రోజు తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి అతుల్‌ దగ్గర ఓ నోట్‌ దొరికింది.

దాంట్లో ‘క్యాన్సర్‌ చాలా ప్రమాదకరమైన రోగం. ఇలా చనిపోవడం క్యాన్సర్‌ కన్నా ఉత్తమం. నేను స్వార్థంతో ఈ పని చేయడం లేదు’ అని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం గురించి ఓ పోలీసాధికారి మాట్లాడుతూ.. ‘క్యాన్సర్‌ వ్యాధికి భయపడి అతుల్‌ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే భారాభర్తలిద్దరిలో క్యాన్సర్‌ ఎవరికి సోకిందనే విషయం స్పష్టంగా తెలీడం లేద’ని పేర్కొన్నారు. అంతేకాక ఈ మధ్య కర్ణాటకలో ఇలాంటి ఆత్మహత్యలు చాలా పెరిగాయని తెలిపారు. ఆత్యహత్యలకు పాల్పడుతున్న వారిలో కుటుంబ సమస్యలతో పాటు ఇలాంటి భయంకరమైన రోగాల బారిన పడినవారే ఎక్కువ మంది ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top