అటవీశాఖాధికారిపై దాడి

Attack On Forest Oficer In Mahaboobnagar Outskirt Forest Area  - Sakshi

మహబూబ్‌నగర్‌ జిల్లా: మద్యం మత్తులో ఆరుగురు యువకులు కన్నూ, మిన్నూ తెలియక  అటవీశాఖాధికారితో జుగుప్సాకరంగా ప్రవర్తించారు. అంతేకాకుండా అతనిపై దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురి చేశారు. కర్నూలు జిల్లా సున్నిపెంట వద్ద అటవీశాఖాధికారిపై ఆరుగురు యువకులు మంగళవారం రాత్రి దాడి చేశారు. అటవీ ప్రాంతంలో మద్యం తాగవద్దన్నందుకు వారు కోపంతో అటవీశాఖాధికారి చెంప చెల్లుమనిపించారు. అందులో ఒకరు తాను ఎమ్మెల్సీ కుమారుడినని, నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు.

అనంతరం అటవీశాఖాధికారి చేత కాళ్లు పట్టించుకుని క్షమాపణ అడిగేలా చేశారు. ఇదంతా పక్కన ఉన్న వ్యక్తి వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన వారు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ విషయం గురించి తోటి అటవీశాఖాధికారులకు సదరు బాధిత అటవీశాఖాధికారి తెలియజేయడంతో వారు వచ్చి ఆ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కర్నూలు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top