బిహార్‌లో మరో దారుణం..

Another Horrifying Incident Took Place In Bihar - Sakshi

పట్నా : ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోంలో చిన్నారులపై లైంగిక దాడుల ఘటన మరువకముందే బిహార్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళుతున్న ఓ స్కూల్‌ విద్యార్థినిని కొందరు వ్యక్తులు చుట్టుముట్టి లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియో వైరల్‌గా మారింది. సహర్షా ప్రాంతంలో సైకిల్‌పై వెళుతున్న స్కూల్‌ బాలికను వేధిస్తూ కొందరు కెమెరాలో పట్టుబడటం దుమారం రేపింది. వైరల్‌ వీడియోలో బాలిక సాయం కోరుతూ విలపించడం కనిపించింది.

నడిరోడ్డుపై ముగ్గురు వ్యక్తులు బాలికను అటకాయించి, ఆమె దుస్తులు లాగేందుకు ప్రయత్నించిన వీడియో బయటపడిన ఘటనలో నిందితుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశామని సహర్షా డీఎస్పీ ప్రభాకర్‌ రివారీ చెప్పారు. బాధితురాలిని గుర్తించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. బాలికను వేధించిన వీడియో ఓ పోలీస్‌ అధికారికి వాట్సాప్‌లో చేరడంతో సహర్షా పోలీసులు రంగంలోకి దిగి అన్ని జిల్లాల పోలీస్‌ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఇతర నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top