సవతి తల్లి పైశాచికం

9 Year Old Uri Girl Raped Before Murder - Sakshi

శ్రీనగర్‌: సవతితోపాటు ఆమె సంతానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఓ మహిళ మానవత్వం మరిచి, దారుణంగా ప్రవర్తించింది. సవతి కూతురు(9)పై తన కొడుకు(14)తోపాటు అతని ఫ్రెండ్స్‌తో గ్యాంగ్‌రేప్‌ చేయించింది. ఆపై గొంతు నులిమి చంపి, కళ్లు పీకించి, యాసిడ్‌ పోయించింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో జరిగింది. యురికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. అతడు రెండో భార్యతోనే ఎక్కువ సమయం గడపడం, ఆమె కూతురంటే వల్లమాలిన ప్రేమ చూపడం మొదటి భార్యకు నచ్చలేదు. ద్వేషం పెంచుకున్న ఆ మహిళ ఆ చిన్నారిని చంపేందుకు పథకం పన్నింది.

ఆగస్టు 23వ తేదీన పదునైన కత్తిని వెంట తెచ్చుకున్న ఆ మహిళ.. సవతి కూతురును వెంటబెట్టుకుని సమీపంలోని అడవిలోకి వెళ్లింది. వారిని ఆమె కుమారుడు, స్నేహితులు అనుసరించి వచ్చారు. అడవిలోకి వెళ్లాక ఆమె చెప్పిన ప్రకారం ఆమె చూస్తుండగానే.. కుమారుడు, అతని స్నేహితులు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ.. బాలిక గొంతు నులిమి చంపింది. ఆమె కుమారుడు చిన్నారి తలపై గొడ్డలితో మోదాడు.

కొందరు బాలురు బాలిక కనుగుడ్లను చాకుతో పీకివేయడంతోపాటు బాలిక శరీరమంతటా యాసిడ్‌ చల్లారు. ఆపై మృతదేహాన్ని పొదల్లో దాచి, ఆకులు, కొమ్మలతో కప్పి వేసి ఇళ్లకు చేరుకున్నారు. తన కుమార్తె కనిపించడం లేదంటూ బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం కనిపించినట్లు గ్రామస్తులు ఆదివారం సమాచారం అందించడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సవతి తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దారుణం వెలుగులోకి వచ్చింది. మృతురాలి సవతి తల్లి, సవతి సోదరుడితోపాటు ఐదుగురిని అరెస్ట్‌చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top