స్టేడియంలో హల్‌చల్‌: యాంకర్‌తోపాటు ఆరుగురు బుక్‌

6 Held for misbehaving During IPLMatch - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ సందర్భంగా  ఆదివారం కొంతమంది యువతీ యువకులు హల్‌ చల్‌ చేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోలకతా నైట్ రైడర్స్‌ మధ్య  మ్యాచ్‌ సందర్భంగా ఈ సంఘటన  చోటు చేసుకుంది.

పెద్ద సంఖ్యలో యువతీ యువకులు  తమకు ఇబ్బంది కలిగించారని ఆరోపిస్తూ భరత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శాంటోష్ ఉపాధ్యాయ్, ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కార్పొరేట్ బాక్స్ 22 నుంచి మ్యాచ్ చూడకుండా వికృత చేష్టలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఉపాధ్యాయ్‌ ఫిర్యాదు ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ముగ్గురు యువతులతో సహా నగరంలోని ఆరుగురు వ్యక్తులను నిందితులుగా చేర్చారు.  ప్రముఖ టీవీ యాంకర్‌ ప్రశాంతితోపాటు పూర్ణిమ,  ప్రియ, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్, వేణుగోపాల్‌పై  కేసు నమోదైంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top