అగ్ని ప్రమాదం; 14 కార్లు దగ్ధం | 14 Cars Burned In Fire In Delhi | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదం; 14 కార్లు దగ్ధం

Jan 16 2020 11:09 AM | Updated on Jan 16 2020 12:45 PM

14 Cars Burned In Fire In Delhi - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలో బుధవారం రాత్రి  వివేక్‌ విహార్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న మైదానంలో అనూహ్యంగా మంటలు చెలరేగడంతో 14 కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు రెండు ఫైర్‌ ఇంజన్లను సంఘటన స్థలానికి చేరుకున్నాయని, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఢిల్లీ అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. పాత కార్లను అమ్మకం, కోనుగోలు నిమిత్తం ఓ వ్యాపారి తన కార్లను బహిరంగ ప్రదేశంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు.  ప్రమాదానికి గల కారణాలను అధికారులు విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement