విప్రో అతిపెద్ద డీల్‌: షేరు జంప్‌ | Wipro bags its biggest-ever contract from Alight Solution | Sakshi
Sakshi News home page

విప్రో అతిపెద్ద డీల్‌: షేరు జంప్‌

Sep 3 2018 11:22 AM | Updated on Sep 3 2018 11:39 AM

Wipro bags its biggest-ever contract from Alight Solution - Sakshi

సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజ సంస్థ విప్రో అమెరికన్‌ కంపెనీనుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. 1.6 బిలియన్ల డాలర్ల కాంట్రాక్టును స్వాధీనం చేసుకుంది.  కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం.  అలైట్ సొల్యూషన్స్‌ నుంచి 1.6 బిలియన్ డాలర్ల విలువైన 10 సంవత్సరాలకు  అవుట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టును గెలుచుకుంది. దీంతో  స్టాక్‌మార్కెట్లో విప్రో భారీ విన‍్నర్‌గా ఉంది.   ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో విప్రో షేరు  సోమవారం దాదాపు 5.5 శాతం జంప్‌చేసింది.

సమీకృత సొల్యూషన్లు, సర్వీసులు అందించేందుకు ఇల్లినాయిస్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లింకన్‌షైర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐటీ సేవల దేశీ సంస్థ విప్రో లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం. అలైట్‌ సొల్యూషన్స్‌ నుంచి లభించిన కాంట్రాక్టు పదేళ్లకాలంపాటు కొనసాగనున్నట్లు తెలియజేసింది. ఒప్పంద కాలంలో 150-160 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరనున్నట్లు  విప్రో వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా డిజిటల్‌ టెక్నాలజీస్‌, ఆటోమేషన్, అనలిటిక్స్‌ సంబంధ సేవలను అందించనున్నట్లు వెల్లడించింది. అలైట్‌ సొల్యూషన్స్ కస్టమర్లకు టెక్నాలజీ ఆధారిత హెల్త్‌, వెల్త్, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌ సొల్యూషన్స్ అందిస్తుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement