మార్కెట్లోకి టొయోటా ఇతియోస్ క్రాస్ | toyota etios cross released in market | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి టొయోటా ఇతియోస్ క్రాస్

May 11 2014 12:38 AM | Updated on Sep 2 2017 7:11 AM

మార్కెట్లోకి టొయోటా ఇతియోస్ క్రాస్

మార్కెట్లోకి టొయోటా ఇతియోస్ క్రాస్

దేశంలో నాల్గో అతిపెద్ద కార్ల కంపెనీ అయిన టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీకేఎం) మరో సరికొత్త కార్‌తో నగరవాసుల ముందుకొచ్చింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో నాల్గో అతిపెద్ద కార్ల కంపెనీ అయిన టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీకేఎం) మరో సరికొత్త కార్‌తో నగరవాసుల ముందుకొచ్చింది. టీకేఎం జీఎం ఆర్కే రమేష్, హర్ష టొయోటా డీలర్ ప్రిన్సిపల్ హర్షవర్ధన్, రాధాకృష్ణ టొయోటా డీలర్ ప్రిన్సిపల్ ఎంవీ శ్రీనివాస్ శనివారమిక్కడ ‘ఇతియోస్ క్రాస్’ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. ఏటా 2 లక్షల టొయోటా కార్లను విక్రయిస్తున్నామని చెప్పారు. మిలియన్ కార్లను విక్రయించిన కంపెనీల జాబితాలో ఇటీవలే తామూ చేరామని, ఇది చాలా ఆనందంగా ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 18 ఔట్‌లెట్లలో ఇతియోస్ క్రాస్ కార్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. దేశంలోని టొయోటా కంపెనీ మొత్తం మార్కెట్ విలువ కంటే ఆంధ్రప్రదేశ్ మార్కెట్ విలువే ఎక్కువగా ఉందని రమేష్ తెలిపారు. మూడు రకాల ఇంజిన్లు ఇతియోస్ క్రాస్ కారు సొంతమన్నారు. రెండు పెట్రోల్ వెర్షన్లు (1.5 లీటర్లు, 1.2 లీటర్లు) కాగా, మరోటి డీజిల్ వెర్షన్ (1.4 లీటర్లు) అని చెప్పారు. పెట్రోల్ వెర్షన్ ధర రూ.5.80 లక్షలు, డీజిల్ వెర్షన్ ధర రూ.7.05 లక్షలని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement