నియామకాలకు ‘సోషల్’ రూట్ | Sakshi
Sakshi News home page

నియామకాలకు ‘సోషల్’ రూట్

Published Mon, Apr 21 2014 1:25 AM

నియామకాలకు ‘సోషల్’ రూట్ - Sakshi

ముంబై: సోషల్ మీడియా వెబ్‌సైట్ల ద్వారా కంపెనీలు ఉద్యోగాలివ్వడం పెరుగుతోంది. కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు సరైన అభ్యర్థులను ఫేస్‌బుక్, లింక్‌డిన్,ట్విటర్, గూగుల్ ప్లస్ తదితర సామాజిక వెబ్‌సైట్ల ద్వారానే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ పోకడ ఈ ఏడాది 50 శాతం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సునిల్ గోయల్(గ్లోబల్‌హంట్), ఆల్ఫ్ హారిస్ (మైకేల్ పేజ్).

నిశ్చల్ సూరి(కేపీఎంజీ ఇండియా పార్ట్‌నర్)వంటి నిపుణుల అభిప్రాయాల ప్రకారం...,
{పతి నిత్యం బిజీగా ఉంటున్న వ్యక్తులకు పరిశ్రమలో వస్తున్న తాజా మార్పులను తెలుసుకోవడానికి సోషల్ మీడియానే ఏకైక సాధనంగా ఉంటోంది. అంతేకాకుండా వీరంతా తమ తాజా స్టేటస్‌లను ఈ వెబ్‌సైట్లలోనే అప్‌డేట్ చేస్తున్నారు. 2010లో ప్రారంభమైన ఈ పోకడ ప్రతీ ఏడాది 50 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోంది.

 ఫలితంగా కంపెనీలు తమకు కావలసిన అభ్యర్ధులను తేలికగా పట్టుకోగలుగుతున్నాయి.

 జాబ్ పోర్టళ్ల ద్వారా, ఉద్యోగ నియామక ఏజెన్సీల ద్వారా ఉద్యోగాలు పొందడం కంటే సోషల్ మీడియా వెబ్‌సైట్ల ద్వారా ఉద్యోగాలు పొందితేనే ఎక్కువ వేతనం డిమాండ్ చేయవచ్చని మధ్య, ఉన్నత స్థాయి మేనేజర్లు భావిస్తున్నారు.

 ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లోని కంపెనీలు వివిధ స్థాయిల్లోని ఉద్యోగాలను సోషల్ మీడియా వెబ్‌సైట్ల ద్వారా భర్తీ చేస్తున్నాయి.

 ఎఫ్‌ఎంసీజీ, తయారీ, విద్యుత్, ఇంధన, రిటైల్, ఆటోమొబైల్ రంగాల్లోని కంపెనీలు కూడా మధ్య, ఉన్నత స్థాయి ఉద్యోగాలను   ఈ వెబ్‌సైట్ల ద్వారా కూడా భర్తీ చేసుకుంటున్నాయి.

 సరైన ఉద్యోగాలు పొందడానికి అభ్యర్థులకు, సరైన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి కంపెనీలకు సోషల్  వెబ్‌సైట్లు కీలకంగా మారాయి.
 
 నియామక ప్రక్రియలో ఇలాంటి వైబ్‌సైట్ల పాత్ర ఒక భాగమే. నియామక ప్రక్రియ నుంచి అభ్యర్థి సామర్థ్యాలను  మదింపు చేసే ప్రక్రియలో మాత్రం ఈ వెబ్‌సైట్ల పాత్ర పరిమితంగానే ఉంటోంది.  

 దాదాపు 80 శాతం వరకూ కంపెనీలు ఉద్యోగ నియామకాలకు సామాజిక మీడియా వెబ్‌సైట్లను ఉపయోగించుకుంటున్నాయి.

 ఈ సోషల్ మీడియా వెబ్‌సైట్ల ద్వారా ఉద్యోగాలివ్వడమనేది ఫార్చ్యూన్ 500, అంతర్జాతీయ కంపెనీల్లో అధికంగా ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement