‘విద్వేష వీడియోలపై విధానంలో కీలక మార్పులు’  | Sundar Pichai Says Youtube Working On removing Hate Speech Videos | Sakshi
Sakshi News home page

‘విద్వేష వీడియోలపై విధానంలో కీలక మార్పులు’ 

Jun 18 2019 2:16 AM | Updated on Jun 18 2019 2:17 AM

Sundar Pichai Says Youtube Working On removing Hate Speech Videos - Sakshi

వాషింగ్టన్‌ : యూట్యూబ్‌లో విద్వేష ప్రసంగాల వీడియోలపై తమ విధానంలో కీలక మార్పులు చేశామనీ, గత త్రైమాసికంలో ఏకంగా 90 లక్షల వీడియోలను తొలగించామని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సోమవారం చెప్పారు. అయితే తాము చేయాల్సింది ఇంకెంతో ఉందని ఆయన అన్నారు. విద్వేషపూరిత, వివాదసహిత, పూర్ణాధిపత్య ధోరణితో ఉన్న వీడియోలను తొలగించేందుకు యూట్యూబ్‌ ప్రయత్నించినప్పటికీ, ఆ వీడియోలు మళ్లీ మళ్లీ కనిపించడంతో గత రెండేళ్లుగా ఆ కంపెనీపై ఉగ్రహం వ్యక్తం అవుతుండటం తెలిసిందే. సీఎన్‌ఎన్‌తో పిచాయ్‌ మాట్లాడుతూ ‘పరిస్థితిని చక్కదిద్దేందుకు మేం చాలా కష్టిస్తున్నాం. యూట్యూబ్‌ వాడకంలో మార్పులను బట్టి ప్రతీ కొన్ని సంవత్సరాలకోసారి పరిణామం చెందాలని మేం అనుకుంటాం. గత వారమే విద్వేష పూరిత వీడియోలపై మా విధానాలను సవరించాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement