కోలుకున్న సూచీలు, ఫ్లాట్‌ ముగింపు  | stockmarkets recovers, endts with Flat note | Sakshi
Sakshi News home page

కోలుకున్న సూచీలు, ఫ్లాట్‌ ముగింపు 

Dec 23 2019 3:43 PM | Updated on Dec 23 2019 3:45 PM

stockmarkets recovers, endts with Flat note - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి. గత వారం అంతా రికార్డు  స్థాయిలను నమోదు చేసిన కీలక  సూచీలు ఆరంభం నుంచి నెగిటివ్‌గా ఉన్నాయి. ఒక దశలో 200 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోకి జారుకున్నాయి.  అత్యంత గరిష్ట  స్థాయిల్లో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. అయితే మిడ్‌ సెషన్‌ తరువాత భారీగా పుంజుకున్న సెన్సెక్స్‌ 38 పాయింట్ల నష్టాలకు పరిమితమైంది. నిఫ్టీ కూడా  కేవలం 9 పాయింట్ల నష్టంతో 12262 వద్ద ముగిసింది. వేదాంతా,  మారుతి సుజుకి, హీరో మోటో, హెచ్‌డీఎఫ్‌సీ, ఆసియన్‌ పెయింట్స్‌  లాభపడగా,  యస్‌బ్యాంకు, నెస్లే, కోల్‌ ఇండియా, రిలయన్స్‌;ఎస్‌బీయై, అదానీ పోర్ట్స్‌ , బ్రిటానియా టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement