ఫ్లాట్‌నుంచి సెంచరీ లాభాల్లోకి.. 

Stockmarkets Opens Flat turns into Green - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ఇన్వెస‍్టర్ల లాభాల స్వీకరణతో నిన్న వెనక్కి తగ్గిన సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో తో ట్రేడింగ్‌ను ఆరంభించాయి.  ఆరంభంలోనే తీవ్ర ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది. ఈ‍ క్రమంలో సెన్సెక్స్‌ నష్టాలనుంచి లాభాల్లోకి మళ్లింది. సెన్సెక్స్‌ ఒక్కసారిగా 105 పాయింట్లు ఎగిసి 39084  వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 11741 వద్ద ట్రేడ్‌ అవుతుంది.  

రేపు (గురువారం) 2019 ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.  మరోవైపు హువావేపై ఆంక్షలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా సడలించడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. 

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 14 శాతం కుప్పకూలి టాప్‌ లూజర్‌గా ఉంది.  ఐటీసీ,  బ్లూ డార్ట్‌, ఐషర్‌ టాప్‌ విన్సర్న్‌గా ఉన్నాయి. మారుతి,  టాటామోటార్స్‌ నష్టాలు కొనసాగుతున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top