స్నాప్‌డీల్ చేతికి లెట్స్‌గోమొ | Snapdeal hand letsgomo | Sakshi
Sakshi News home page

స్నాప్‌డీల్ చేతికి లెట్స్‌గోమొ

Jun 16 2015 1:25 AM | Updated on Oct 22 2018 5:27 PM

స్నాప్‌డీల్ చేతికి లెట్స్‌గోమొ - Sakshi

స్నాప్‌డీల్ చేతికి లెట్స్‌గోమొ

ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ స్నాప్‌డీల్ తాజాగా మొబైల్ అప్లికేషన్ రంగంలో ఉన్న లెట్స్‌గోమొ ల్యాబ్స్‌ను కొనుగోలు చేసింది...

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ స్నాప్‌డీల్ తాజాగా మొబైల్ అప్లికేషన్ రంగంలో ఉన్న లెట్స్‌గోమొ ల్యాబ్స్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించిందీ వెల్లడి కాలేదు.  మొబైల్ ఫోన్ మాధ్యమం ద్వారా అమ్మకాలను మరింత మెరుగుపర్చుకునేందుకు లెట్స్‌గోమొ కొనుగోలు తమకు ఉపకరిస్తుందని స్నాప్‌డీల్ ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం 75 శాతం పైగా అమ్మకాలు మొబైల్ ప్లాట్‌ఫామ్ ద్వారానే జరుగుతున్నాయని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ బన్సల్ తెలియజేశారు. మొబైల్ సంబంధిత యాప్స్, సర్వీసులు మొదలైన వాటిని లెట్స్‌గోమొ అందిస్తోంది. ఇందులో 76 మంది ఉద్యోగులు ఉన్నారు. స్నాప్‌డీల్ ఇటీవలే ఆన్‌లైన్ రీచార్జ్ సంస్థ ఫ్రీచార్జ్‌ను, మొబైల్, వెబ్ కామర్స్ సైట్లు తయారు చేసే మార్ట్‌మొబి సంస్థలను కొనుగోలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement