స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ఫ్లిప్‌కార్ట్‌ సూచన!

Smartphone User Alert! You Can Claim Refund Of Your Phone Broken Screen - Sakshi

మొబైల్‌ స్క్రీన్‌ పగిలిపోతే, చాలామంది చాలా బాధపడిపోతారు. అయ్యో ఇప్పుడు కొత్త స్క్రీన్‌ వేయించుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతాదో ఏమో అని. కానీ ఇక నుంచి అలాంటి బాధలే అవసరం లేదట. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ ఓ స్మార్ట్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదే ఫ్లిప్‌కార్ట్‌ స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌. ఈ ప్లాన్‌ కింద మీ ఫోన్‌ స్క్రీన్‌కు కూడా ఫ్లిప్‌కార్ట్‌ బీమా చేస్తుందట. స్క్రీన్‌ బీమా 150 రూపాయల నుంచి ప్రారంభమవుతుందని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. మొబైల్‌ స్క్రీన్లకు మరింత సురక్షితం అందించాలని ఎవరైతే భావిస్తారో వారి కోసం ఫ్లిప్‌కార్ట్‌ ఈ బంపర్‌ ప్లాన్‌ అందిస్తోంది. ఈ ప్లాన్‌ కింద, ఒకవేళ స్క్రీన్‌ డ్యామేజ్‌ అయితే, ఫోన్‌ ధరలో ఫ్లాట్‌ 20 శాతాన్ని ఫ్లిప్‌కార్ట్‌ రీఫండ్‌ చేయనుంది. ఈ మొత్తాన్ని యూజర్ల బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేయనుందని తెలిసింది.   

ఫ్లిప్‌కార్ట్‌ స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ను పొందడమెలా..
ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నప్పుడు, కొనుగోలుదారులు ‘స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌’ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌ ధర రూ.150 నుంచి ప్రారంభమవుతుంది. ఫోన్‌ ధరను బట్టి ఈ మొత్తం ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. 
రెండు విధానాల ద్వారా ప్రయోజనాలను యూజర్లు పొందుతారు. ఫోన్‌ వాడుతూ ఉన్నప్పుడు ఫోన్‌ స్క్రీన్‌ డ్యామేజ్‌ అయితే, ఈ ప్లాన్‌... ఫోన్‌ను రీఫైర్‌ చేయడానికి లేదా రీఫండ్‌కు అనుమతి ఇస్తోంది. ఆ సమయంలో క్లయిమ్‌ను పొందవచ్చు. క్లయిమ్‌ ప్రక్రియంతా ఆన్‌లైన్‌ ద్వారానే సాగుతుంది. 

రీఫండ్‌ ప్రక్రియలో క్లయిమ్‌ పొందడం...
దీని కింద, కొనుగోలుదారులు కంపెనీ నెంబర్లు 1800 425 5568 లేదా 080-25187326 కు కాల్‌ చేయాల్సి ఉంటుంది. protect@jeeves.co.in అనే అడ్రస్‌కైనా ఈమెయిల్‌ చేయాల్సి ఉంటుంది. ఆ అనంతరం మీ నెంబర్‌కు ఫ్లిప్‌కార్ట్‌ సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ వీడియో పంపుతుంది. అప్పుడు మీరు డ్యామేజ్‌ అయిన స్క్రీన్‌తో పాటు ఐఎంఈఐ నెంబర్‌ కనిపించేలా పగిలిపోయిన డివైజ్‌ను వీడియో తీసి కంపెనీకి పంపాల్సి ఉంటుంది. అప్పుడు కంపెనీ సెల్ఫ్‌ సర్వే రిపోర్టును పరిశీలించి, అంతకముందు జరిగిన ఘటనలతో పోల్చి చూసి, మీకు క్లయిమ్‌ వస్తుందో రాదో చెబుతోంది. ఆ అనంతరం మీ బ్యాంకు అకౌంట్‌లో నగదు జమ అవుతుంది. 

రీఫైర్‌ ప్రొసెస్‌ అనంతరం క్లయిమ్‌ పొందడం....
ఈ ప్ర​క్రియలో కూడా కొనుగోలుదారుడు కంపెనీ నెంబర్లు 1800 425 5568 లేదా 080- 25187326 కొనుగోలు చేయాల్సి ఉంటుంది.  లేదా ఈమెయిల్‌ ద్వారా అయినా మీ అభ్యర్థనను కంపెనీకి పంపవచ్చు. ఆ ఈ-మెయిల్‌లో మీరు అందించే మీ ప్రాంత పిన్‌కోడ్‌ బట్టి, దగ్గర్లోని జీవ్స్‌ అథారైజడ్‌ సర్వీసు సెంటర్‌ వివరాలను కంపెనీ అందిస్తోంది. అక్కడికి వెళ్లి, రీఫైల్‌ వివరాలను తెలుసుకోవాలి. ఆ సెంటర్‌ వారు ఫోన్‌ను రీఫైర్‌ చేస్తామని చెబితే, మొత్తం రీఫైరింగ్‌ ఖర్చును అక్కడి కట్టి, ఫోన్‌ను రీఫైర్‌ చేయించుకోవాలి. ఆ రీఫైర్‌ ఖర్చుతో వారు మీకు ఒక ఇన్‌వాయిస్‌ ఇస్తారు. ఆ అనంతరం జీవ్స్‌కు కాల్‌ చేసి, ఫోన్‌ విలువలో 20 శాతం క్లయిమ్‌ను లేదా మొత్తం రీఫైర్‌ ఖర్చును క్లయిమ్‌ చేసుకోవచ్చు. ఏదైతే తక్కువగా ఉంటుందో అది కంపెనీ మీ ఖాతాలో క్రెడిట్‌ చేస్తుంది. ఒకవేళ జీవ్స్‌ సెంటర్‌ మీ ఫోన్‌ రీఫైర్‌ చేయడానికి ఒప్పుకోకపోతే, రీఫండ్‌ ద్వారా క్లయిమ్‌ను పొందవచ్చు. 

ప్లాన్‌ ఎలా అందిస్తోంది, షరతులు ఏమిటి?
క్లయిమ్‌ ఆమోదం పొందడానికి ఎలాంటి చర్చలు జరపడానికి వీలులేదు. కానీ 72 గంటల్లో నగదు మాత్రం వినియోగదారుని అకౌంట్‌కు బదిలీ అవుతాయి. ఫోన్‌ ధరను ఇన్‌వాయిస్‌ ఆధారంగా లెక్కిస్తారు. మార్కెట్‌ ధర అనుగుణంగా కాదు. క్లయిమ్‌ పొందేటప్పుడు ఎలాంటి మొత్తాన్ని కూడా యూజర్లు చెల్లించాల్సినవసరం లేదు. ఆశ్చర్యకరంగా ఫోన్‌ను ఎవరు వాడుతున్నారో కంపెనీ పట్టించుకోదు. దీని కోసం ఎలాంటి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సినవసరం లేదు. 

ప్లాన్‌ వేటికి వర్తించదు?
స్క్రీన్‌ కాకుండా మిగతావి ఏమన్నా డ్యామేజ్‌ అయితే, ఇది వర్తించదు. ఫోన్‌ చోరికి గురైనా కూడా ప్లాన్‌ వర్తించదు. మాన్‌ఫ్రాక్ట్ర్చర్‌ వారెంటీ కింద డ్యామేజ్‌ అయినా కూడా స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ కిందకి రాదు. అన్ని యాక్ససరీస్‌ కూడా ఈ ప్లాన్‌ కిందకి రావు. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే కొత్త ఫోన్లకు మాత్రమే ఈ ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ ఉంటుంది. ఫోన్‌ కొనుగోలు చేసేటప్పుడే, ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను కొనుగోలు చేయాలి. ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి ఎలాంటి ప్రొవిజన్‌ ఉండదు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top