చైర్మన్‌ కంటే మూడు రెట్లు అధిక వేతనం 

SBI Offers Up To One crore For CFO Post - Sakshi

ఎస్‌బీఐ సీఎఫ్‌వోకు దరఖాస్తుల ఆహ్వానం

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వరంగంలోని ఎస్‌బీఐ నూతన సీఎఫ్‌వో నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. మూడేళ్ల కాలానికి కాంట్రాక్టు విధానంపై నియమించుకోనుంది. రూ.కోటి వేతన ప్యాకేజీ ఇవ్వనున్నది. అన్ని రకాల వ్యయాలు కలసి (సీటీసీ) రూ.75 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఉండనున్నాయి. అయితే, ఎస్‌బీఐ చైర్మన్‌కు 2018–19లో ఇచ్చిన పారితోషికం కేవలం రూ.29.5 లక్షలు కాగా, దాంతో పోలిస్తే సీఎఫ్‌వోకు మూడు రెట్లు అధికంగా ఆఫర్‌ ఇవ్వడం ఆసక్తికరం. ప్రస్తుతం ఎస్‌బీఐ సీఎఫ్‌వోగా చలసాని వెంకట్‌ నాగేశ్వర్‌ పనిచేస్తున్నారు.(చెక్‌ బౌన్స్‌ నేరం... ఇక క్రిమినల్‌ కాదు!!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top