76.80 స్థాయికి పడిపోయిన రూపాయి

Rupee drops 36 paise to all time low per dollar - Sakshi

మరో రికార్డు కనిష్టానికి పతనమైన రూపాయి

సాక్షి,ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి బలహీనతకు అంతం లేకుండా పోతోంది. వరుస రికార్డు పతనంతో కుదేలవుతున్న రూపాయి గురువారం మరోసారి రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. డాలరు మారకంలో 36 పైసలు నష్టంతో 76.80  స్థాయిని తాకింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 76.75 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ఆపై ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 76.80కి  చేరింది.  బుధవారం 76.44 వద్ద ముగిసింది.  అంతర్జాతీయంగా ముడి చమురు ధర (బ్రెంట్ ఫ్యూచర్స్) 1.44 శాతం పెరిగి బ్యారెల్ కు 28.09 డాలర్లకు చేరుకుంది.

కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరగడంతో ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందనే ఆందోళన నెలకొంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతుండటంతో సెంటిమెంటు బలహీనంగా వుంది. అలాగే డాలరు బలం కూడా రూపాయి బలహీనతకు కారణమని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా భారతదేశంలో ఇప్పటివరకు 12,380 కేసులు నమోదయ్యాయి.  (యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top