ఎయిర్‌టెల్‌పై భారీ జరిమానా విధించండి | Reliance Jio tells Trai Airtel issuing 'misleading ads' on free services | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌పై భారీ జరిమానా విధించండి

Jan 28 2017 2:01 AM | Updated on Sep 5 2017 2:16 AM

ఎయిర్‌టెల్‌పై భారీ జరిమానా విధించండి

ఎయిర్‌టెల్‌పై భారీ జరిమానా విధించండి

వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటనలు ఇస్తోందని రిలయన్స్‌జియో టెలికం నియంత్రణ సంస్థ, ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది.

ట్రాయ్‌కు రిలయన్స్‌ జియో ఫిర్యాదు
న్యూఢిల్లీ: వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటనలు ఇస్తోందని  రిలయన్స్‌జియో టెలికం నియంత్రణ సంస్థ, ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. ప్రమోషన్‌ ఆఫర్లలో అందించే డేటా గురించి ఎయిర్‌టెల్‌ అతిగా ప్రచారం చేస్తోందని, తప్పుదోవ పట్టించేలా టారిఫ్‌ యాడ్స్‌ను ఇస్తోందని రిలయన్స్‌ జియో పేర్కొంది.

అందుకని భారతీ ఎయిర్‌టెల్‌పై అధిక మొత్తంలో జరిమానా విధించాలని పేర్కొంది. ఫ్రీ యూసేజ్‌ పాలసీ(ఎఫ్‌యూపీ) గురించి ప్రకటనల్లో ఎయిర్‌టెల్‌ కంపెనీ   ఎక్కడా ప్రస్తావించడం లేదని, ఎవరైనా ఫోన్‌ చేస్తేనే, కాల్‌సెంటర్‌లో వివరణ ఇస్తున్నారని తెలిపింది. ఇది ట్రాయ్‌ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement