మరో సంచలనానికి రెడీ అవుతున్న జియో | Reliance Jio set to launch DTH services, set-top box leaked online | Sakshi
Sakshi News home page

మరో సంచలనానికి రెడీ అవుతున్న జియో

Apr 4 2017 4:25 PM | Updated on Sep 5 2017 7:56 AM

మరో సంచలనానికి రెడీ అవుతున్న జియో

మరో సంచలనానికి రెడీ అవుతున్న జియో

టెలికాం మార్కెట్లో దూకుడుగా ఉన్న రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీయబోతుందట.

టెలికాం మార్కెట్లో దూకుడుగా ఉన్న రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీయబోతుందట. డీటీహెచ్ సర్వీసు స్పేస్ లోకి రిలయన్స్ జియో అరంగేట్రం చేయబోతున్నట్టు తెలుస్తోంది. జియో డీటీహెచ్ లకు సంబంధించిన సెటాప్ బాక్స్ ఇమేజ్ లు ప్రస్తుతం ఆన్ లైన్ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతమున్న ఈ సెటాప్ బాక్స్ ల మాదిరిగానే దీర్ఘచతురస్రాకారంలో ఇవి కనిపిస్తున్నాయి. ఫ్రంట్ లో యూఎస్బీ పోర్టు కూడా ఉంది. బ్లూ రంగులో ఉన్న ఈ బాక్స్ లపై రిలయన్స్ జియో బ్రాండు ముద్రించి ఉంది.యూఎస్బీ తో పాటు స్టాండర్డ్ కేబుల్ కనెక్టర్, హెచ్డీఎంఐ, వీడియో, ఆడియో అవుట్ పుట్ లు దీనిలో ఉన్నట్టు తెలుస్తోంది..
 
360 పైగా చానళ్లను జియో టీవీ ఆఫర్ చేయనుందని ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. వాటిలో 50 హెచ్డీ ఛానల్స్ ఉండబోతున్నాయట. వాయిస్ తోనే ఛానల్స్ ను సెర్చ్ చేసుకునే విధంగా యూజర్లకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హీరో, హీరోయిన్ పేరు చెబితే చాలు, వారి సినిమాలు ఏ ఛానలో వస్తాయో తెలుస్తుందట. డేటా సర్వీసుల మాదిరిగానే డీటీహెచ్ విభాగంలోనూ జియో సంచలనాలు సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తుందని ఈ ఆన్ లైన్ ఇమేజ్ ల బట్టి వెల్లడవుతుందని ఇండస్ట్రి వర్గాలంటున్నాయి. ప్రత్యర్థి డీటీహెచ్ సర్వీసుల కంటే చాలా తక్కువ రేటుకు ఛానళ్లను అందుబాటులోకి తేనుందని చెబుతున్నారు. తొలుత ముంబాయిలో ప్రారంభించిన అనంతరం ఈ సేవలను దేశవ్యాప్తంగా కంపెనీ విస్తరించనుందని టాక్.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement