ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌...షేరు క్రాష్‌

RBL Bank Q1 net profit rises 41percent to 267 crore - Sakshi

సాక్షి, ముంబై: ప్రయివేట్‌ రంగ సంస్థ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. శుక్రవారం విడుదల చేసిన క్యూ1(ఏప్రిల్‌-జూన్‌) ఫలితాల్లో అంచనాలకు మించి రాణించింది.  బ్యాంకు నికర లాభం 41 (40.5) శాతం ఎగసి  రూ. 267 కోట్లగా  నమోదు చేసింది.  నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 48 శాతం పుంజుకుని రూ. 817 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) స్థిరంగా 1.38 శాతం వద్దే నమోదయ్యాయి.  అయితే గైడెన్స్‌పై  యాజమాన్యం వ్యాఖ్యలతో ఆర్‌బీఎల్‌ కౌంటర్‌లో అమ్మకాలు జోరందుకున్నాయి ఫలితాల ప్రకటనతో  ఇన్వెసర్ల కొనుగోళ్లతో లాభపడిన షేరు ఒక్కసారిగా  9 శాతం పతనమైంది.  మేనేజ్‌మెంట్‌ నిరాశజనక గైడెన్స్‌ అంచనాలు సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని  ఎనలిస్టులు భావించారు. 

త్రైమాసిక ప్రాతిపదికన నికర ఎన్‌పీఏలు 0.69 శాతం నుంచి 0.65 శాతానికి  క్షీనించాయి. ఇక ప్రొవిజన్లు రూ. 213 కోట్లుకాగా.. క్యూ4లో రూ. 200 కోట్లుగా నమోదు చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన స్లిప్పేజెస్‌ రూ. 206 కోట్ల నుంచి రూ. 225 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో రూ. 147 కోట్లను రైటాఫ్‌ చేసింది. క్యూ4లో ఇవి రూ. 91 కోట్లు. కాగా నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) ఆల్‌టైమ్‌ గరిష్టం వద్ద  4.3 శాతాన్ని తాకాయి. రానున్న కాలంలో అదనపు ప్రొవిజన్లు చేపట్టవలసి ఉంటుందని దీంతో రుణ వ్యయాలు 0.35-0.4 శాతంమేర పెరగవచ్చని బ్యాంకు యాజమాన్యం వ్యాఖ్యానించింది. అలాగే స్థూల ఎన్‌పీఏలు 2.25-2.5 శాతానికి చేరవచ్చంటూ అభిప్రాయపడింది. కొన్ని కార్పొరేట్‌ ఖాతాలు  ఇబ్బందికరంగా పరిణమించినట్టు తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top