రూ.10 లక్షల కోట్ల మెగా గిఫ్ట్‌

 Railways Plans Rs 10 Lakh Crore High Speed Train Corridors - Sakshi

న్యూఢిల్లీ : దేశీయ రైల్వే త్వరలోనే రూ.10 లక్షల కోట్ల మెగా గిఫ్ట్‌ను ప్రకటించబోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మేజర్‌ నగరాలను కలుపుతూ.. 10వేల కిలోమీటర్లలో రూ.10 లక్షల కోట్ల హై-స్పీడ్‌ ట్రైన్‌ కారిడార్స్‌ను రైల్వే నిర్మించబోతుంది. దీంతో పాటు భారతమాలా హైవేస్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ కూడా ప్రభుత్వం చేపట్టబోతుంది.  

దేశీయ రైల్వే ఈ ప్లాన్‌ను ఏప్రిల్‌లో ప్రకటించబోతుందని రైల్వే మంత్రిత్వ శాఖ టాప్‌ అధికారి ఒకరు చెప్పారు. ఫండింగ్‌ మెకానిజంతో కనెక్ట్‌ అయ్యే రూట్లను ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. ​కొత్తగా నిర్మించబోతున్న రైల్వే లైన్లలో ట్రైన్లు గంటకు 200 కిలోమీటర్లు ప్రయాణించనున్నట్టు తెలిపారు. 

పెద్ద పెద్ద టెండర్లతోనే రైల్వే ముందుకు రాబోతుందని,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దిగ్గజాలను ఆహ్వానించనుందని తెలుస్తోంది. నిర్మాణ ఖర్చును కిలోమీటరుకు రూ.200 కోట్ల నుంచి రూ.100 కోట్లకు తగ్గించేందుకు సింగిల్‌ పిల్లర్స్‌పై డబుల్‌ లైన్స్‌ను నిర్మించేందుకు కూడా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. అదేవిధంగా ప్రత్యేకంగా తక్కువ బరువున్న అల్యూమినియం కోచ్‌లను కూడా డిజైన్‌ చేస్తోంది.  

ప్రభుత్వం ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్‌ మధ్యలో 534 కిలోమీటర్ల బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ను నిర్మిస్తోంది. దీని ఖర్చు లక్ష కోట్లకు పైననే. ఈ ప్రాజెక్ట్‌ 2022 వరకు ముగియనుంది. ఢిల్లీ-ఛండీగర్‌, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్‌కత్తా, బెంగళూరు-చెన్నై కారిడార్లను ఇప్పటికే పూర్తి చేసేసింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top