12,13 తేదీల్లో పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె | PSU bank employees to go on strike | Sakshi
Sakshi News home page

12,13 తేదీల్లో పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె

Jul 11 2016 12:54 AM | Updated on Sep 4 2017 4:33 AM

12,13 తేదీల్లో పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె

12,13 తేదీల్లో పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల ప్రతిపాదిత విలీనం, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకు నిరసనగా జూలై 12,13 తేదీల్లో

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల ప్రతిపాదిత విలీనం, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకు నిరసనగా జూలై 12,13 తేదీల్లో ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ)బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలంకావడంతో తాము గతంలో ఇచ్చిన పిలుపుమేరకు సమ్మె చేయనున్నట్లు ఆల్ అండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం చెప్పారు. జూలై 12న కేవలం ఐదు ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేస్తారని, ఆ మరుసటిరోజు జూలై 13న ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement