పెట్రోలు ధర రూ.5 లు తగ్గింపు | Petrol Prices cut by Rs 5, Diesel Down by Rs 1 | Sakshi
Sakshi News home page

పెట్రోలు ధర రూ.5 లు తగ్గింపు

Feb 18 2019 2:56 PM | Updated on Feb 19 2019 7:27 AM

Petrol Prices cut by Rs 5, Diesel Down by Rs 1 - Sakshi

ఒకవైపు అంతర్జాతీయంగా చమురుధరలు మళ్లీ పరుగు అందుకోగా పంజాబ్‌ ప్రభుత్వం వాహన దారులకు శుభవార్త అందించింది.   2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థికమంత్రి మన్‌ప్రీత్‌ సింగ్ బాదల్   సమర్పించిన బడ్జెట్‌లో పెట్రో ధరలపై వ్యాట్‌ను  తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  దీంతో  పెట్రోలు ధర  రూ.5, డీజిల్‌ ధర  రూ.1 తగ్గనుంది.  సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. 

కొత్తగా పన్నుల వడ్డన ఏమీలేకుండానే రూ. 1,58,493 కోట్లతో  బడ్జెట్‌ను రాష్ట్ర  ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ, ఆరోగ్యం, విద్య, గ్రామీణ, పట్టణ మౌలిక సదుపాయాలపై బడ్జెట్ ప్రాథమికంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement