స్వల్పంగా పెరిగిన పెట్రో ధరలు | Petrol, Diesel Become Costlier on Monday | Sakshi
Sakshi News home page

స్వల్పంగా పెరిగిన పెట్రో ధరలు

Feb 11 2019 9:55 AM | Updated on Feb 11 2019 9:55 AM

Petrol, Diesel Become Costlier on Monday - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరలు  స్వల్పంగా  పెరిగాయి. సోమవారం (ఫిబ్రవరి 11)  వివిధ మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర 5 పైసలు , డీజిల్ ధర 6 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గిన కూడా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం.

తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.33 వద్ద.. డీజిల్ ధర రూ.65.62 వద్ద కొనసాగుతున్నాయి. వాణిజ్య రాజధాని  లీటరు ముంబైలో పెట్రోల్ ధర రూ.75.97 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.68.71 వద్ద ఉంది.  అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 61.67 డాలర్ల వద్ద.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 52.17 డాలర్ల వద్ద ఉంది. 

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు
కోల్‌కతా : పెట్రోలు ధర లీటరు రూ. 72.44, డీజిల్‌ ధర రూ. 67.40
చెన్నై : పెట్రోలు ధర లీటర్‌ రూ. 73.00 డీజిల్‌ ధర రూ. 69.32
బెంగళూరు : పెట్రోలు ధర లీటర్‌72.65 డీజిల్‌ ధర రూ. 67.78
హైదరాబాద్ :పెట్రోలు ధర లీటర్‌  74.62 డీజిల్‌ ధర రూ.71.34
విజయవాడ : పెట్రోలు ధర లీటర్‌ 74.05    డీజిల్‌ ధర రూ.70.40

Advertisement
 
Advertisement
Advertisement