నోకియా 3.1 విడుదల 

Nokia 3.1 with Android Go and 5.2-inch display launched in India  - Sakshi

ధర రూ.10,499

న్యూఢిల్లీ: ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా బ్రాండ్‌ ఫోన్స్‌ విక్రయ సంస్థ హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ గురువారం భారత మార్కెట్‌లో నోకియా 3.1 ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదలచేసింది. 13 మెగాపిక్సెల్‌ ఆటో ఫోకస్‌ కెమోరా, 5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే (2.5డీ కర్వుడ్‌) కలిగిన ఈ ఫోన్‌ ధర రూ.10,499గా నిర్ణయించినట్లు తెలిపింది.

మీడియా టెక్‌ 6750 చిప్‌సెట్‌తో నడిచే ఈ స్మార్ట్‌ఫోన్‌ జులై 21 (శనివారం) నుంచి నోకియా డాట్‌ కామ్‌/ఫోన్స్, పేటీఎమ్‌ మాల్, రిటైలర్ల ద్వారా అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. ఆండ్రాయిడ్‌ వన్‌ ఓఎస్‌ ఆధారంగా ఈ ఫోన్‌ పనిచేస్తుందని తెలిపింది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top