హీరో ఎక్స్‌ట్రీమ్‌ 200 ఆర్‌ బైక్‌ ఆవిష్కరణ | New Hero Xtreme 200R bike unveiled ahead of Auto Expo 2018 | Sakshi
Sakshi News home page

హీరో ఎక్స్‌ట్రీమ్‌ 200 ఆర్‌ బైక్‌ ఆవిష్కరణ

Jan 30 2018 7:20 PM | Updated on Jan 30 2018 7:47 PM

New Hero Xtreme 200R bike unveiled ahead of Auto Expo 2018 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ‌: ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు, దేశీయదిగ్గజం హీరో మోటోకార్ప్ తన కొత్త ప్రీమియం మోటార్‌ సైకిల్‌ను మంగళవారం ఆవిష్కరించింది.   200 సీసీ విభాగంలో ఈ కొత్త బైకును లాంచ్‌ చేసింది . ఇప్పటికే 150 సీసీ విభాగంలో విజయవంతమైన ఎక్స్‌ట్రీమ్‌ మోడల్‌ను 200సీసీ విభాగంలో కూడా ప్రవేశపెట్టనుంది. యంగ్‌  కస్టమర్లే లక్ష్యంగా రూపొందంచిన ఈ బైక్‌ 2018, ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. ముఖ‍్యంగా నాన్‌ ఏబీస్‌ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఏబీస్‌ ఆప్లన్లలో ఇది లభించనుంది. ధర వివరాలను కూడా అప్పుడే రివీల్‌ చేయనుంది.

కొత్త ఎక్స్‌ట్రీమ్‌ 200ఆర్‌లో సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్‌ 8500 ఆర్‌పీఎం వద్ద 18.4 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. డిజిటల్ అనలాగ్ కన్సోల్, 5స్పీడ్ గేర్బాక్స్ సిస్టం,   ఫ్రంట్‌లో 37ఎంఎం టేలీస్కోపిక్ ఫోర్కులు వెనుక  7 ఇంచెస్‌ మెనోషాక్‌ సస్పెన్షన్, 17 అంగుళాల స్పోర్టి అల్లాయ్ వీల్స్,ఎల్‌ఈడీ పైలట్ ల్యాంప్స్  వెనక 130/70 రేడియల్‌ టైర్లు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.   ఈ బైక్‌లో ఉన్న బ్యాలెన్సర్‌ షిఫ్ట్‌ కారణంగా వైబ్రేషన్స్‌ చాలా తక్కువగా ఉంటాయనీ, ట్రాఫిక్‌లో కూడా సులభంగా నడపటానికి వీలుగా ఈ ఇంజిన్‌ను తయారు చేసినట్లు హీరో పేర్కొంది. కాగా ఇది  టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్‌ 200 4వీ, బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్‌ 200కి గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాల అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement