మింత్రా చేతికి నేటివ్ 5 | Myntra acquires mobile app development platform company Native5 | Sakshi
Sakshi News home page

మింత్రా చేతికి నేటివ్ 5

May 8 2015 1:44 AM | Updated on Sep 3 2017 1:36 AM

ఫ్యాషన్ ఉత్పత్తులు విక్రయించే ఈ-కామర్స్ సంస్థ మింత్రా తాజాగా బెంగళూరుకు చెందిన మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ కంపెనీ నేటివ్5ని కొనుగోలు చేసింది.

బెంగళూరు: ఫ్యాషన్ ఉత్పత్తులు విక్రయించే ఈ-కామర్స్ సంస్థ మింత్రా తాజాగా బెంగళూరుకు చెందిన మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ కంపెనీ నేటివ్5ని కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించినదీ తెలియలేదు. నేటివ్5 కొనుగోలుతో తమ మొబైల్ టెక్నాలజీ టీమ్ మరింత పటిష్టమవుతుందని మింత్రా ఒక ప్రకటనలో తెలిపింది. కునాల్ అభిషేక్, బరద సాహు, షమిక్ దత్తానంద్, మనీష్ ప్రియదర్శి కలిసి 2012లో నేటివ్5ని ఏర్పాటు చేశారు. వీరిలో మనీష్ ప్రియదర్శి మినహా మిగతా టీమ్ అంతా మింత్రాలో చేరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement