ఫ్లిప్‌కార్ట్‌ గుడ్‌న్యూస్‌.. ఇక హైదరాబాద్‌లోనూ కొత్త ఆఫర్‌! | Flipkart VIP Subscription Program expands to Hyderabad | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌ గుడ్‌న్యూస్‌.. ఇక హైదరాబాద్‌లోనూ కొత్త ఆఫర్‌!

Apr 17 2024 6:23 PM | Updated on Apr 17 2024 6:27 PM

Flipkart VIP Subscription Program expands to Hyderabad - Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో ప్రారంభించిన వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను ఇప్పుడు హైదరాబాద్‌కు విస్తరించింది. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లు ఉచిత డెలివరీ, తగ్గింపు వంటి ఆఫర్లను పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ వీఐపీ (Flipkart VIP) సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను కొత్తగా హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, భువనేశ్వర్, కోయంబత్తూర్, గౌహతి, పాట్నా, పూణే, రాంచీలలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. కస్టమర్‌లు సంవత్సరానికి రూ. 499 చెల్లించి ఫ్లిప్‌కార్ట్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్  తీసుకోవచ్చు. 

ఫ్లిప్‌కార్ట్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలు
ఈ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ లక్షలాది ఉత్పత్తులపై 48-గంటల ఉచిత డెలివరీ, అన్ని ఉత్పత్తులపైనా చెల్లింపుల కోసం సూపర్‌ కాయిన్స్‌ను ఉపయోగించి 5 శాతం అదనపు డిస్కౌంట్‌ పొందవచ్చు. క్లియర్‌ట్రిప్‌లో ఒక్క రూపాయికే ఫ్లైట్‌ క్యాన్సిల్‌  లేదా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. క్లియర్‌ట్రిప్ హోటల్ బుకింగ్‌లపై అదనపు ఆఫర్‌లు, 48 గంటలలోపు రిటన్‌ పికప్. షాపింగ్ ఫెస్టివల్స్‌కు ముందస్తు యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఉంటాయి.

ఇలా ఎలా నమోదు చేసుకోండి..

  • ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్ లేదా యాప్‌ని సందర్శించండి
  • మీ వివరాలతో లాగిన్ చేయండి. ఒకవేళ మీరు ప్లాట్‌ఫామ్‌కు కొత్త అయితే, మీ వివరాలను అందించి అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోండి.
  • వీఐపీ ల్యాండింగ్ పేజీకి స్క్రోల్ చేసి, 'గెట్‌ వీఐపీ బెనిఫిట్స్‌' బటన్‌పై నొక్కండి
  • చెల్లింపు, తుది ప్రక్రియ ​కోసం 'కంనిన్వ్యూ' క్లిక్ చేయండి
  • మీకు అనువైన మోడ్ ద్వారా చెల్లింపు వివరాలను నమోదు చేసి ఆర్డర్‌ను కన్‌ఫర్మ్‌ చేఏయండి
  • విజయవంతంగా నమోదు చేసుకున్న తర్వాత, వెబ్‌సైట్ లేదా యాప్‌లో కన్‌ఫర్మేషన్‌ మెసేజ్‌ వస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement