వేల్యూ- వాల్యూమ్స్‌తో చిన్న షేర్ల జోరు

Mid, Small caps gain with volumes - Sakshi

జాబితాలో శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌

 గ్రాన్యూల్స్‌ ఇండియా, ఐనాక్స్‌ లీజర్‌ సైతం

సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ

కోవిడ్‌-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ తొలి దశలో సత్ఫలితాలు ఇచ్చిందన్న వార్తలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌  మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి.మధ్యాహ్నం 2 కల్లా సెన్సెక్స్‌  246 పాయింట్లు పెరిగి 30,275కు చేరగా.. నిఫ్టీ 77 పాయింట్లు పుంజుకుని 8,900 వద్ద ట్రేడవుతోంది.మోడర్నా ఇంక్‌ రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ తొలి దశ పరీక్షలు విజయవంతమైన వార్తలతో సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సైతం జోరందుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో గ్రాన్యూల్స్‌ ఇండియా, ఐనాక్స్‌ లీజర్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, ఏషియన్ హోటల్స్‌, జెన్‌ టెక్నాలజీస్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

గ్రాన్యూల్స్‌ ఇండియా
ఎన్‌ఎస్‌ఈలో ఈ ఫార్మా రంగ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 164 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 169కు ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 95,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.22 లక్షల షేర్లు చేతులు మారాయి. 

ఐనాక్స్‌ లీజర్‌
ఎన్‌ఎస్‌ఈలో మల్టీప్లెక్స్‌ రంగ ఈ షేరు 5 శాతం పెరిగి రూ. 173 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 182కు ఎగసింది.అంతేకాకుండా రూ. 159 దిగువన 52 వారాల కనిష్టాన్ని సైతం తాకింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 29,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.33 లక్షల షేర్లు చేతులు మారాయి. 

శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ఎన్‌బీఎఫ్‌సీ రంగ ఈ షేరు 2 శాతం బలపడి రూ. 588 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 621కు ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2.69 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.5 లక్షల షేర్లు చేతులు మారాయి. 

ఏషియన్‌ హోటల్స్‌(ఈస్ట్‌)
ఎన్‌ఎస్‌ఈలో ఆతిధ్య రంగ ఈ షేరు 6 శాతం పురోగమించి రూ. 136 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 151కు ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 39000 షేర్లు చేతులు మారాయి. 

జెన్‌ టెక్నాలజీస్‌
ఎన్‌ఎస్‌ఈలో రక్షణ రంగ పరికరాల తయారీ ఈ కంపెనీ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 40 వద్ద ట్రేడవుతోంది. కొనేవాళ్లు అధికంకావడంతో అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 5500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 27000 షేర్లు చేతులు మారాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top