హైదరాబాద్‌లో 'ఎంఐ హోం' షోరూమ్‌ | mi home open on september 12 in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో 'ఎంఐ హోం' షోరూమ్‌

Sep 6 2017 8:17 PM | Updated on Sep 4 2018 5:29 PM

హైదరాబాద్‌లో 'ఎంఐ హోం' షోరూమ్‌ - Sakshi

హైదరాబాద్‌లో 'ఎంఐ హోం' షోరూమ్‌

ప్రముఖ చైనా మొబైల్‌ కంపెనీ షావోమి తన మార్కెట్‌ను పెంచుకోవడానికి మరో నిర్ణయం తీసుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ చైనా మొబైల్‌ కంపెనీ షావోమి తన మార్కెట్‌ను పెంచుకోవడానికి మరో నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఎంఐ హోమ్‌ పేరుతో ప్రత్యేక షోరూమ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో షోరూమ్‌లు నెలకొల్సిన షావోమి ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ప్రత్యేక షోరూమ్‌ను ఏర్పాటు చేయనుంది.

ఈనెల 12న హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 'ఎంఐ హోం' షోరూమ్‌ను ప్రారంభించనుంది. ఈమేరకు షావోమి తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ షోరూమ్‌లో ఎంఐ అన్ని ప్రొడక్టులు దొరకుతాయని పేర్కొంది. అలాగే గత మంగళవారం విడుదల చేసిన ఎంఐ ఏ1 ప్రీబుకింగులు గురువారం నుంచి ప్రారంభమౌతాయని ప్రకటించింది.

ఇంకా చదవండి: ఎంఐ ఏ1 లాంచ్‌, ఫీచర్లు

Advertisement
 
Advertisement
Advertisement