మారుతి సుజుకి ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్

Maruti Suzuki introduces Limited Edition Ertiga in India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మారుతి సుజుకి  తన పాపులర్‌ వెహికల్‌లో లిమిటెడ్‌ ఎడిషన్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది.  ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో లిమిటెడ్‌ ఎడిషన్‌ ఎర్టిగాను లిస్ట్‌ చేసింది. పెట్రోల్‌ వెర్షన్‌ రూ. 7.8 లక్షలు,  స్మార్ట్‌హైబ్రిడ్‌ వెర్షన్‌ ధర 9.51 లక్షల(ఎక్స్‌ షోరూం, ఢిల్లీ) మధ్య ఉండనుంది. పాపులర్‌ మల్టీ పర్సస్‌ వెహికల్‌ (ఎమ్‌పీవీ) ఎర్టిగాను ‘టుగెదర్‌నెస్‌ ఈజ్‌ ద న్యూ స్టయిల్‌’ అనే ట్యాగ్ ‌లైన్‌తో సరికొత్తగా పరిచయం చేసింది. సాంకేతికంగా పెద్దగా మార్పులు చేయనప్పటికీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో  రూపొందించింది.

మారుతి ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ రెండు ఇంజన్ ఆప్షన్‌లను 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. అదనంగా పెట్రోల్ మోడల్‌ను 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. ఈ  వేరియంట్‌ ఇంటీరియర్‌లో డోర్ ట్రిమ్స్, లెథర్ సీట్లు, స్టీరింగ్ వీల్ కవర్,  డ్యాష్‌బోర్డ్ మీద ఫాక్స్ వుడ్ డిజైన్‌ను జోడించింది. ఇంకా ఫాగ్ ల్యాంప్స్,  క్రోమ్ బెజెల్ హౌసింగ్స్, అల్లాయ్ వీల్స్, క్రోమ్ సైడ్ మౌల్డింగ్స్, రూఫ్ రెయిల్స్, వెనుక వైపున లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జింగ్ వంటివి ఉన్నాయి.  సిల్కీ సిల్వర్, సూపీరియర్ వైట్,  మెరూన్ మూడు విభిన్న రంగుల్లో ఈ వెహికల్‌ అందుబాటులోకి రానుంది.

మారుతి ఎర్టిగా  లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్ల విషయానికే  వస్తే..1.4-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ మల్టీ జెట్ టర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌తో లభ్యం కానుంది.  పెట్రోల్ ఇంజన్ 90బిహెచ్‌పి పవర్-130ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా, డీజల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ - 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి.

మరోవైపు సెకండ్‌ జనరేషన్‌ ఎర్టిగాను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కొత్త పెట్రోల్ ఇంజన్‌, 1.5 లీటర్ నాలుగు సిలిండర్లతో  అవుట్‌ గోయింగ్ మోడల్ కన్నా పెద్దదిగా భారత్‌లో ఈ ఏడాది దీపావళి నాటికి  తీసుకురానుందట.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top