రూ.7499కే స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ

 JVC Launches 6 New Smart LED TVs in India, Prices Start at Rs. 7,499 - Sakshi

అత్యంత తక్కువ ధరలో జేవీసీ టీవీలు

24-32 అంగుళాల స్మార్ట్‌టీవీలు

ఒక సంవత్సరం వారంటీ, స్మార్ట్‌ రిమోట్‌

సాక్షి,  ముంబై:  ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జేవీసీ ఇండియన్ మార్కెట్లో  మరో ఆరు కొత్త స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను లాంచ్‌ చేసింది.  వీటి ధరలు రూ.7499 నుంచి ప్రారంభం కానున్నాయి.  24 నుంచి 39 అంగుళాల మధ్య టీవీల స్క్రీన్ సైజ్ ఉండేలా ఈ  స్మార్ట్‌ఎల్‌ఈడీ టీవీలను ఆవిష్కరించింది.  ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఇది అందుబాటులో ఉంటాయి.  జేవీసీ 32 అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ టీవీ ధర రూ.11,999గా ఉంది.  ఒ​క  సంవత్సరం వారంటీ కూడా ఉంది.  

అతితక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చిన జేవీసీ  కొత్త ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీలు, షావోమి, థామ్సన్‌, మార్క్‌ లాంటి  బ్రాండ్లకు గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  టీవీల్లో 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1366x768 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 20 వాట్ సౌండ్ ఔట్‌పుట్, 2 యూఎస్‌బీ పోర్ట్స్, 3 హెచ్‌డీఎంఐ పోర్ట్స్ , స్మార్ట్‌ రిమోట్‌ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top