ఫ్రాన్స్‌ ఎయిర్‌లైన్స్‌తో జెట్‌ ఒప్పందం

jet Airways, Air France-KLM tie up to boost traffic - Sakshi

సాక్షి, ముంబై:  అంతర్జాతీయ విమాన సర్వీసులను మరింత విస్తరించే లక్ష్యంతో జె ట్‌ ఎయిర్‌వేస్‌  మరో కీలక ఒప్పందం చేసుకుంది. ఎయిర్‌ ఫ్రాన్స్‌ కేఎల్ఎం,  డెల్టా ఎయిర్‌ లైన్స్‌తో భారీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.   యూరోప్‌లో  తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు గాను  ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జెట్ ఛైర్మన్ నరేష్ గోయెల్ , ఎయిర్ ఫ్రాన్స్-కెఎల్‌ఎం చీఫ్ జెఎం జనైల్లాక్ బుధవారం భారతదేశంలో కోడ్  భాగస్వామ్యంపై అధికారిక ప్రకటన చేశారు.

కనెక్టివిటీని మరింత విస్తరించుకునే లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు జెట్‌ ఎయిర్‌వేస్‌  సీఈవో వినయ్‌ దుబే ప్రకటించారు.  అయితే ఈ రెండు ఎయిర్లైన్స్ ఈక్విటీ వాటాను ప్రకటించలేదు  అలాగే ఇతిహాద్‌తో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు.  పెరుగుతున్న పోటీ నేపథ్యంలో అంతర్జాతీయ రవాణాదారులు మార్గాల్లో  విస్తరిస్తున్నామనీ ,తమకు గల్ఫ్ ఒక ముఖ్యమైన మార్కెట్‌గా  కొనసాగుతుంది.  దాని కార్యకలాపాలను తగ్గించదని  జెట్ ఛైర్మన్ నరేష్ గోయెల్ విలేకరులకు తెలిపారు.  ఈ నేపథ్యంలో బుధవారం నాటి ట్రేడింగ్‌లో జెట్‌ఎయిర్‌వేస్‌ కౌంటర్‌ బాగా లాభపడింది.

కాగా ఇండియన్ అంతర్జాతీయ ఎయిర్ ట్రాఫిక్ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌లో  ఇతిహాద్‌  సహా మూడు పెద్ద గల్ఫ్ సంస్థలు  24 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జెట్ ఎయిర్వేస్ గ్రూప్ ప్రస్తుతం 115 విమానాల విమానాలను నిర్వహిస్తుండగా, ఎయిర్ ఫ్రాన్స్-కెఎల్‌ఎం 34 విమానాల విమానాలను కలిగి ఉంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top