హ్యుందాయ్‌ ‘వెర్నా’లో కొత్త వెర్షన్‌ | Hyundai launches 2017 Verna at introductory starting price of Rs 7.99 lakh | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్‌ ‘వెర్నా’లో కొత్త వెర్షన్‌

Aug 23 2017 12:57 AM | Updated on Sep 17 2017 5:51 PM

హ్యుందాయ్‌ ‘వెర్నా’లో కొత్త వెర్షన్‌

హ్యుందాయ్‌ ‘వెర్నా’లో కొత్త వెర్షన్‌

దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్‌’ తాజాగా ‘వెర్నా’లో కొత్త వెర్షన్‌ను (ఐదో జనరేషన్‌) మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

ప్రారంభ ధర రూ.7.99 లక్షలు  
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్‌’ తాజాగా ‘వెర్నా’లో కొత్త వెర్షన్‌ను (ఐదో జనరేషన్‌) మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది. మిడ్‌సైజ్డ్‌ సెడాన్‌ విభాగంలో తిరిగి అధిక మార్కెట్‌ వాటాను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది. ఈ ఐదో జనరేషన్‌ వెర్నా ప్రధానంగా హోండా సిటీ, మారుతీ సుజుకీ సియాజ్‌ మోడళ్లకు గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని పెట్రోల్‌ వేరియంట్స్‌ ధర రూ.7.99 లక్షలు–రూ.12.23 లక్షల శ్రేణిలో, డీజిల్‌ వేరియంట్స్‌ ధర రూ.9.19 లక్షలు–రూ.12.61 లక్షల శ్రేణిలో ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఇక ఈ వాహనాలకు సంబంధించి నెలకు 4,000 నుంచి 5,000 యూనిట్ల విక్రయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) ఎండీ, సీఈవో వై.కె.కో తెలిపారు. కాగా పైన పేర్కొన్న కార్ల ధరలు తొలి 20,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని, తర్వాత వాహన ధరలను పెంచుతామని హెచ్‌ఎంఐఎల్‌ డైరెక్టర్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) రాకేశ్‌ శ్రీవాత్సవ పేర్కొన్నారు. కొత్త వెర్షన్‌ వెర్నాలో 1.6 లీటర్‌ పెట్రోల్‌/డీజిల్‌ ఇంజిన్స్, మాన్యువల్‌/ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్స్, సన్‌రూఫ్, స్టాండర్డ్‌ డ్యూయెల్‌ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement