హోండా మొబిలియో ఇదిగో... | Honda's Mobilio Looks to Repeat Indonesia Success in India | Sakshi
Sakshi News home page

హోండా మొబిలియో ఇదిగో...

Jul 24 2014 1:50 AM | Updated on Sep 2 2017 10:45 AM

హోండా మొబిలియో ఇదిగో...

హోండా మొబిలియో ఇదిగో...

జపాన్‌కు చెందిన హోండా కంపెనీ భారత్‌లో తన తొలి మల్టీ-పర్పస్ వెహికల్(ఎంపీవీ), మొబిలియోను బుధవారం ఆవిష్కరించింది.

 న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన హోండా కంపెనీ భారత్‌లో తన తొలి మల్టీ-పర్పస్ వెహికల్(ఎంపీవీ), మొబిలియోను బుధవారం ఆవిష్కరించింది.  పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో మొబిలియో లభ్యమవుతుందని పేర్కొన్నారు.  హోండా మోటార్ కంపెనీ మేనేజింగ్ ఆఫీసర్ యోషియుకి మత్సుమోటో చెప్పారు. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.6.49 లక్షల నుంచి రూ.8.76 లక్షల రేంజ్‌లో, డీజిల్ వేరియంట్ ధరలు రూ.7.89 లక్షల నుంచి రూ.10.86 లక్షల రేంజ్‌లోనూ ఉన్నాయి.

మూడు వేరియంట్లు(ఈ, ఎస్, వీ), ఏడు రంగుల్లో ఈ కారు లభ్యమవుతుందని వివరించారు.  2017 కల్లా 3 లక్షల వార్షిక అమ్మకాలు సాధించడం లక్ష్యంగా ఈ ఎంపీవీని అందిస్తున్నామని పేర్కొన్నారు. డీజిల్ కారు 24.2 కిమీ, పెట్రోల్ కారు 17.3 కిమీ. మైలేజీనిస్తుందని కంపెనీ అంటోంది. మారుతీ సుజుకి ఎర్టిగ, జీఎం షెవర్లే ఎంజాయ్, నిస్సాన్ ఇవలియా, టయోటా ఇన్నోవాలకు  మొబిలియో గట్టి పోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాల అంచనా.

 ఇండోనేిసియాలో సక్సెస్...
 ఈ ఏడాది జనవరిలో మొబిలియో కారును ఇండోనేషియా మార్కెట్లో విడుదల చేశామని, ఈ సెగ్మెంట్‌లో 23% మార్కెట్ వాటా సాధించిందని మత్సమోటో చెప్పారు. అమేజ్, సిటీ కార్లు మంచి అమ్మకాలు సాధించాయని... మొబిలియో కూడా ఇదేతరహాలో విజయం సాధింస్తుందన్న విశ్వాసం ఉందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో హిరొనొరి కనయమ చెప్పారు.

Advertisement

పోల్

Advertisement