breaking news
Honda Cars India Ltd.
-
నీ లుక్ అదిరే, సరికొత్త ఫీచర్లతో విడుదలైన సెడాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న హోండా కార్స్ ఇండియా కొత్త అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసింది.ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధరలు వేరియంట్‌నుబట్టి రూ.6.32 లక్షల నుంచి రూ.11.15 లక్షల మధ్య ఉంది.పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్స్‌లో వేరియంట్లను ప్రవేశపెట్టింది.పెట్రోల్ 1.2 లీటర్, డీజిల్ 1.5 లీటర్లో ఇంజన్‌ను రూపొందించింది. వేరియంట్‌నుబట్టి పెట్రోల్ అయితే 18.6 కిలోమీటర్లు, డీజిల్ 24.7 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది ఎనిమిదేళ్లలో అమేజ్ శ్రేణిలో ఇప్పటి వరకు దేశంలో కంపెనీ 4.5 లక్షల యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో 68 శాతం వాటా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి సమకూరిందని కంపెనీ ప్రెసిడెంట్ గాకు నకనిశి ఈ సందర్భంగా తెలిపారు. 40% మంది కస్టమర్లు తొలిసారిగా అమేజ్‌ను సొంతం చేసుకున్నారని చెప్పారు. దక్షిణాఫ్రికా, నేపాల్, భూటాన్‌కు సైతం భారత్ నుంచి అమేజ్ కార్లు ఎగుమతి అవుతున్నాయని వివరించారు. చదవండి: ప్రైవేట్ ట్రైన్స్, రూ.30వేల కోట్ల టెండర్లను రిజెక్ట్ చేసిన కేంద్రం -
హోండా మొబిలియో ఇదిగో...
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన హోండా కంపెనీ భారత్‌లో తన తొలి మల్టీ-పర్పస్ వెహికల్(ఎంపీవీ), మొబిలియోను బుధవారం ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో మొబిలియో లభ్యమవుతుందని పేర్కొన్నారు. హోండా మోటార్ కంపెనీ మేనేజింగ్ ఆఫీసర్ యోషియుకి మత్సుమోటో చెప్పారు. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.6.49 లక్షల నుంచి రూ.8.76 లక్షల రేంజ్లో, డీజిల్ వేరియంట్ ధరలు రూ.7.89 లక్షల నుంచి రూ.10.86 లక్షల రేంజ్లోనూ ఉన్నాయి. మూడు వేరియంట్లు(ఈ, ఎస్, వీ), ఏడు రంగుల్లో ఈ కారు లభ్యమవుతుందని వివరించారు. 2017 కల్లా 3 లక్షల వార్షిక అమ్మకాలు సాధించడం లక్ష్యంగా ఈ ఎంపీవీని అందిస్తున్నామని పేర్కొన్నారు. డీజిల్ కారు 24.2 కిమీ, పెట్రోల్ కారు 17.3 కిమీ. మైలేజీనిస్తుందని కంపెనీ అంటోంది. మారుతీ సుజుకి ఎర్టిగ, జీఎం షెవర్లే ఎంజాయ్, నిస్సాన్ ఇవలియా, టయోటా ఇన్నోవాలకు మొబిలియో గట్టి పోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాల అంచనా. ఇండోనేిసియాలో సక్సెస్... ఈ ఏడాది జనవరిలో మొబిలియో కారును ఇండోనేషియా మార్కెట్లో విడుదల చేశామని, ఈ సెగ్మెంట్లో 23% మార్కెట్ వాటా సాధించిందని మత్సమోటో చెప్పారు. అమేజ్, సిటీ కార్లు మంచి అమ్మకాలు సాధించాయని... మొబిలియో కూడా ఇదేతరహాలో విజయం సాధింస్తుందన్న విశ్వాసం ఉందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో హిరొనొరి కనయమ చెప్పారు.