నీ లుక్‌ అదిరే, సరికొత్త ఫీచర్లతో విడుదలైన సెడాన్‌

Honda Launches 2021 Amaze Sub Compact Sedan - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీలో ఉన్న హోండా కార్స్‌ ఇండియా కొత్త అమేజ్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ కారును విడుదల చేసింది.ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధరలు వేరియంట్‌నుబట్టి రూ.6.32 లక్షల నుంచి రూ.11.15 లక్షల మధ్య ఉంది.పెట్రోల్, డీజిల్‌ పవర్‌ట్రెయిన్స్‌లో వేరియంట్లను ప్రవేశపెట్టింది.పెట్రోల్‌ 1.2 లీటర్, డీజిల్‌ 1.5 లీటర్‌లో ఇంజన్‌ను  రూపొందించింది. వేరియంట్‌నుబట్టి పెట్రోల్‌ అయితే 18.6 కిలోమీటర్లు, డీజిల్‌ 24.7 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది

ఎనిమిదేళ్లలో అమేజ్‌ శ్రేణిలో ఇప్పటి వరకు దేశంలో కంపెనీ 4.5 లక్షల యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో 68 శాతం వాటా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి సమకూరిందని కంపెనీ ప్రెసిడెంట్‌ గాకు నకనిశి ఈ సందర్భంగా తెలిపారు. 40% మంది కస్టమర్లు తొలిసారిగా అమేజ్‌ను సొంతం చేసుకున్నారని చెప్పారు. దక్షిణాఫ్రికా, నేపాల్, భూటాన్‌కు సైతం భారత్‌ నుంచి అమేజ్‌ కార్లు ఎగుమతి అవుతున్నాయని వివరించారు.

చదవండి: ప్రైవేట్‌ ట్రైన్స్‌, రూ.30వేల కోట్ల టెండర‍్లను రిజెక్ట్‌ చేసిన కేంద్రం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top