నెలాఖరుకల్లా అన్ని బ్యాంకుల్లో మొబైల్‌ బ్యాంకింగ్‌ | Govt asks all banks to have mobile banking facility by March 31 | Sakshi
Sakshi News home page

నెలాఖరుకల్లా అన్ని బ్యాంకుల్లో మొబైల్‌ బ్యాంకింగ్‌

Mar 2 2017 12:28 AM | Updated on Sep 5 2017 4:56 AM

నెలాఖరుకల్లా అన్ని బ్యాంకుల్లో మొబైల్‌ బ్యాంకింగ్‌

నెలాఖరుకల్లా అన్ని బ్యాంకుల్లో మొబైల్‌ బ్యాంకింగ్‌

డిజిటల్‌ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే దిశగా ఈ నెలాఖరు నాటికి (మార్చి 31) మొబైల్‌ బ్యాంకింగ్‌ (ఎం–బ్యాంకింగ్‌) సదుపాయాన్ని...

న్యూఢిల్లీ: డిజిటల్‌ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే దిశగా ఈ నెలాఖరు నాటికి (మార్చి 31) మొబైల్‌ బ్యాంకింగ్‌ (ఎం–బ్యాంకింగ్‌) సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని బ్యాంకులన్నింటినీ కేంద్రం ఆదేశించింది. మొబైల్‌ ఫోన్‌ గల ప్రతీ ఖాతాదారు ఎం–బ్యాంకింగ్‌ను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం కార్యదర్శి అరుణ సుందరరాజన్‌ తెలిపారు.

గతంలో మొబైల్‌ బ్యాంకింగ్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవడంతో అత్యధిక శాతం కస్టమర్లు దీనిపై ఆసక్తి చూపేవారు కాదని, ప్రస్తుతం చాలా మంది ఎం–బ్యాంకింగ్‌ కోరుకుంటున్న నేపథ్యంలో మార్చి 31లోగా అన్ని బ్యాంకులు తమ తమ ఖాతాదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి తేవాలని పేర్కొన్నట్లు ఆమె వివరించారు. యూపీఐ లేదా భీమ్‌ యాప్‌ ఉపయోగిస్తున్న ఖాతాదారులకు ఆటోమేటిక్‌గా మొబైల్‌ బ్యాంకింగ్‌ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement