ఇన్‌బాక్స్‌కు గుడ్‌బై చెబుతున్న గూగుల్‌

Google Inbox App Is Shutting Down In March 2019 - Sakshi

గూగుల్‌ తన ‘ఇన్‌బాక్స్‌’ యాప్‌కు గుడ్‌బై చెప్పబోతుంది. జీమెయిల్‌కు రీఫోకస్‌ చేసే క్రమంలో ఈ ఈ-మెయిల్‌ యాప్‌ను నిలిపివేస్తుంది. 2019 మార్చి నుంచి ఇన్‌బాక్స్‌ గుడ్‌బై చెప్పడంటూ గూగుల్‌ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ యాప్‌ని ఉపయోగిస్తున్నవారంతా జీమెయిల్‌కు మారేందుకు గడువు ఇచ్చింది గూగుల్. వాస్తవానికి గూగుల్‌కు జీమెయిల్ యాప్ ఉంది. అయినా 2014లో ఈ 'ఇన్‌బాక్స్' యాప్‌ని రూపొందించింది. అయితే 'ఇన్‌బాక్స్' యాప్‌కు అంత స్పందనేమీ రాలేదు. అందుకే సేవల్ని నిలిపివేసి, జీమెయిల్‌పై రీఫోకస్‌ చేయాలని గూగుల్ భావిస్తున్నట్టు తెలిసింది. 

ఇన్‌బాక్స్‌ యూజర్లు ఆన్‌లైన్‌ గైడ్‌ ద్వారా జీమెయిల్‌తో అనుసంధానం కావాలంటూ గూగుల్‌ జీమెయిల్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ మాథ్యూ ఇజట్ తన బ్లాగ్‌ పోస్టులో పేర్కొన్నారు. జీమెయిల్‌లో మీ సంభాషణలన్నీ ఇప్పటికే వేచిచూస్తున్నాయంటూ మాథ్యూ పేర్కొన్నారు. అంటే స్టోర్‌ చేసుకున్న ఈమెయిల్స్‌ను యూజర్లు బదిలీ చేసుకోవాల్సినవసరం లేదని తెలిసింది.  'ఇన్‌బాక్స్' యాప్‌లో ఇమెయిల్ స్నూజ్, ఏఐ, స్మార్ట్ రిప్లై, హై ప్రియారిటీ నోటిఫికేషన్స్‌, స్మార్ట్ కంపోజ్ లాంటి ఫీచర్లున్నాయి. ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన ఈ యాప్‌లో ఉన్న ఫీచర్స్‌తో ఇటీవలే జీమెయిల్‌ యాప్‌ను గూగుల్‌ సరికొత్త డిజైన్‌లో అప్‌డేట్‌ చేసింది. దాంతో 'ఇన్‌బాక్స్' యాప్‌ తన ప్రత్యేకతను కోల్పోయి, యూజర్లూ తగ్గారు. అందుకే ఇక ఈ యాప్‌ను నిలిపివేయాలని గూగుల్‌ నిర్ణయించింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top