అప్పుడు జుకర్బర్గ్ది..ఇప్పుడు పిచాయ్ది..! | Google CEO Sundar Pichai's Quora account has been hacked | Sakshi
Sakshi News home page

అప్పుడు జుకర్బర్గ్ది..ఇప్పుడు పిచాయ్ది..!

Jun 28 2016 1:10 AM | Updated on Sep 4 2017 3:33 AM

అప్పుడు జుకర్బర్గ్ది..ఇప్పుడు పిచాయ్ది..!

అప్పుడు జుకర్బర్గ్ది..ఇప్పుడు పిచాయ్ది..!

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు చెందిన కోరా అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ చర్యకు పాల్పడింది ఎవరో కాదు..

కోరా అకౌంట్‌ను హ్యాక్ చేసిన అవర్‌మైన్
న్యూయార్క్: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు చెందిన కోరా అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ చర్యకు పాల్పడింది ఎవరో కాదు.. ఇది వరకు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన ట్వీటర్, పింటరెస్ట్ అకౌంట్లను హ్యాక్ చేసిన ‘అవర్‌మైన్’ సంస్థే మళ్లీ ఇప్పుడు పిచాయ్ అకౌంట్‌నూ హ్యాక్ చేసింది. ఈ సంస్థ పిచాయ్ అకౌంట్ ద్వారా ఆయనకు తెలియకుండానే కోరాలో పలు మెసేజ్‌లను పోస్ట్ చేసింది. కోరా అకౌంట్ ట్వీటర్‌తో కూడా అనుసంధానమై ఉండటంతో అవర్‌మైన్ చేసిన పోస్టులన్నీ.. పిచాయ్‌కున్న 5,08,000 మంది ఫాలోవర్స్‌కు వెళ్లాయి. అవర్‌మైన్ సంస్థ తొలిగా ‘హ్యాక్‌డ్’ అని పోస్ట్ చేసింది. తర్వాత మీ సెక్యూరిటీ లెవెల్స్‌ను పరీక్షించడానికే హ్యాక్ చేశామని తరువాతి పోస్ట్‌లలో పేర్కొంది. పిచాయ్ టీమ్ కోరా అకౌంట్‌ను తిరిగి తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. తదనంతరం అకౌం ట్‌లోని అవర్‌మైన్ పోస్ట్‌లను తొలగించారు. కాగా అవర్‌మైన్ సంస్థ టెక్ దిగ్గజాల అకౌంట్లను ఎలా హ్యాక్ చేస్తోందనేది ఇప్పటిదాకా వెల్లడి కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement