కస్టమర్లకు వినాయక చవితి శుభాకాంక్షలు: గరుడవేగ

Garudavega Wishes Customers On Ganesh Chaturthi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వినాయక చవితిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులందరికీ గరుడవేగ కొరియర్‌ సర్వీసెస్‌ శుభాకాంక్షలు తెలిపింది. మనోహరమైన వినాయక విగ్రహాలను ఈ ఏడాది అట్లాంటా, సియాటిల్, కాలిఫోర్నియాలోని దేవాలయాలకు గరుడవేగ ద్వారా పంపించడం ఆనందదాయకంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. వినియోగదారులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఈ ప్రేమ ఎల్లవేళలా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.

కాగా అమెరికా, ఇంగ్లండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు మధ్య తూర్పులోని ఇతర దేశాలతో కలిపి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు ఎంతో నమ్మకమైన, చురుకైన సేవలను గరుడవేగ అందిస్తోంది. బహుళ ప్రజాదరణ పొందిన "ఎక్స్‌ప్రెస్‌" సర్వీస్‌తో పాటు, అమెరికాకు కేజీ ఒక్కింటికి కేవలం నాలుగువందల రూపాయల రుసుముతో (50 కేజీలు అంతకు పైగా వున్న పార్సళ్ళకు), అతి సులభంగా సరుకులను పంపే సదుపాయం కల్పిస్తోంది. ఈ సరుకులు 5 నుంచి 8 రోజులలోపు అమెరికాలో ఉన్న మీ బంధువులకు చేరతాయి. మరిన్ని వివరాలకోసం గరుడవేగ ఏజెంట్లను సంప్రదించవచ్చు.

అదే విధంగా "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమవారికోసం బహుమతులూ, స్వీట్లూ పంపే సదుపాయాన్ని గరుడవేగ కల్పిస్తోంది. తద్వారా పండుగ సమయాలలో, తాము దూరంగా ఉన్నప్పటికీ, తమవారిని తలుచుకుని, వారికి కానుకలు పంపి వారిని ఆనందింపజేయవచ్చు. ఇలా వేల మైళ్ళ దూరంలో ఉన్న కుటుంబ సభ్యులను కలిపే ఈ సర్వీస్ ద్వారా, ప్రేమను, ఆప్యాయతను పంచడం తమకు ఎంతో సంతృప్తినిస్తోందని గరుడవేగ తెలిపింది. గ్రాండ్ స్వీట్స్, శ్రీకృష్ణ, అడయార్ ఆనందభవన్ వంటి ప్రసిద్ధి చెందిన తమిళనాడు స్వీట్ సంస్థల నుంచి కూడా ఇప్పుడు మీరు గరుడవేగ ద్వారా, నేరుగా మీ ఇంటికి స్వీట్లు తెప్పించుకోవచ్చని సూచిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top