8వ రోజూ పెట్రో సెగ | Fuel prices shoot up for 8th straight day | Sakshi
Sakshi News home page

8వ రోజూ పెట్రో సెగ

Sep 24 2019 1:46 PM | Updated on Sep 24 2019 2:04 PM

Fuel prices shoot up for 8th straight day - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ:  చమురు ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా 8వ రోజు కూడా పెట్రో ధరలు భగ్గుమన్నాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు  లీటరు ధర రూ. 74 మార్క్‌కు చేరగా,  ముంబై  80 రూపాయలకు చేరింది. పెట్రోల్‌ పై 22 పైసలు, డీజిల్‌పై 14 పైసలు పెంచుతూ చమురు ఉత్పత్తి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.  8 రోజుల్లో లీటరు పెట్రోల్‌పై 2.20 రూపాయలు, డీజిల్‌పై 1.64 రూపాయలు పెరిగింది. సౌదీలో చమురు బావులపై డ్రోన్ దాడులు తర్వాత.. ముడి చమురు ధరల పెరుగుదల దేశంలో కూడా ప్రభావం చూపుతోందని చమురు సంస్థలు చెబుతున్నాయి. 2014 నుంచి పెట్రోల్‌ పైన 211.7శాతం , డీజిల్‌ పైన 443శాతం సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ పెరిగింది. దాదాపుగా 12సార్లు ఎన్‌డిఎ ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీని సవరించింది.

విజయవాడ :  లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 78.10, డీజిల్‌ ధర రూ. 72.10  
హైదరాబాద్‌: లీటర్‌ పెట్రోల్‌ ధర   రూ. 78.80, డీజిల్‌ ధర 73.11
ఢిల్లీ : లీటర్‌ పెట్రోల్‌ ధర   రూ. 74.13, డీజిల్‌ ధర రూ. 67.07
ముంబై : లీటర్‌ పెట్రోల్‌ ధర   రూ. 79.79, డీజిల్‌ ధర 70.37
చెన్నై:  లీటర్‌ పెట్రోల్‌ ధర   రూ. 77.06, డీజిల్‌ ధర  రూ. 70.91

చదవండి : సౌదీ ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీపై డ్రోన్‌దాడి కలకలం


 

Advertisement
 
Advertisement
Advertisement